ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు రసం, అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతారు.
ఉగాది పచ్చడి తయారీ విధానం: అవసరమై పదార్ధాలు:
మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1
వేప పువ్వు- 1/2 కప్పు
సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు
కొత్త చింతపండు- 100 గ్రాములు
కొత్త బెల్లం- 100 గ్రాములు
మిరపకాయలు- 2
అరటిపండు - 1
చెరకు రసం -1/2 కప్పు
ఉప్పు - సరిపడేంత
నీళ్లు
అవసరమైతే అరటి పళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు.
తయారు చేసే విధానం:
ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత స్వీకరించాలి. అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయండి. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి సేవనం తెలియజేస్తుంది.
Related Postings:
keywords:
తెలుగువారి ఉగాది పచ్చడి ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది ,Ugadi Pachadi Recipe In Telugu,Ugadi Pachadi Recipes,ugadi pachadi preparation in Telugu,how to make ugadi pachadi,ugadi pachadi ingredients,ugadi pachadi telangana style,how to make ugadi pachadi,ఉగాది పండుగ - Importance of Ugadi Festival Ugadi Pachadi Recipes,ఉగాది రోజున పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో దీన్ని తయారు చేస్తారు.ugadi pachadi in telugu,Ugadi Pachadi Recipes ఉగాది పచ్చడి తయారు,vikari nama samvatsara,vikari nama samvatsara rasi phalalu,Gudi Padwa,రాశి ఫలాలు,శ్రీ వికారి నామ సంవత్సరం రాశి ఫలాలు,రాశి ఫలాలు,ఉగాది రోజు పాటించాల్సిన నియమాలు, Ugadi Special ,Dharma Sandehalu ,Ugadi,Ugadi In Telugu,Ugadi Festivals,Ugadi 2019,Ugadi Pachadi,Ugadi Greetings,Ugadi Quotes,Ugadi wishes,Dharma Sandehalu,Dharma Sandehalu in telugu,Ap Festivals,Telugu Festivals,Telugu Ugadi,Andhra Festivals ,Telugu Panchangam,Telugu Rasi Phalalu,Astrology,Astrology In Telugu,Vastu,Pooja Vidhi,Pooja Vidhi In telugu,Pooja Vidhanam,Puja,ఉగాది,ఉగాది పండుగ చరిత్రని తెలుసుకోండి,ఉగాది అంటే ఏమిటి,Importance of Ugadi Festival,ఉగాది పండుగ,Bhakthi
Comments
Post a Comment