శ్రీ లక్ష్మీ కుబేరపూజ ఇలా పూజిస్తే సంపదలు కలుగుతాయి | Laxmi Kubera Pooja Vidhi In Telugu



కుబేరుడి ఫోటోను, ప్రతిమను స్వతహాగా మనం కొనుక్కుని ఇంట్లో పూజ చేయడం కంటే.. ఇతరుల నుంచి కానుకగా వచ్చే కుబేరుడిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయని విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం యక్షులకు కుబేరుడు రాజు. ఇతడు సిరి సంపదలకు అధిపతి. 
కుబేరుడు ధనాధిదేవత. శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం.
అలాంటి ధనాధిపతి అయిన కుబేరుడిని పూజించే వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇంకా కుబేరుడి బొమ్మను ఇతరులకు కానుకగా ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఇతరులు కానుకగా ఇచ్చే కుబేరుడిని పూజించడం ద్వారా అప్పుల బాధ, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. 

రుణబాధలు, ఈతిబాధలు, వ్యాపారంలో వృద్ధి, సామాజిక గుర్తింపు, సంతానం కోసం కుబేరుడి వ్రతాన్ని ఆచరించాలి. ఇంకా ఇతరుల నుంచి కానుకగా వచ్చిన కుబేరుడి బొమ్మను లేదా పటాన్ని పూజించడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవని పురోహితులు అంటున్నారు.


ధనపతి అని కూడా పిలువబడే ఇతని అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడిగా వ్యహరించే కుబేరుడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.
ధనానికి అధిపతి కుబేరుడే ఇక ఈ విశ్వంలో సంపద ఏదైనా ... అది ఏ రూపంలో వున్నా దానికి అధిపతి కుబేరుడే అని చాలా మంది నమ్ముతారు. పద్మ ... మహాపద్మ ... శంఖ ... మకర ... కచ్చప ... ముకుంద ... కుంద ... నీల ... వర్చస అనే 'నవ నిధులు' ఆయన ఆధీనంలో వుంటాయి. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా పూజ చేయండి.
తూర్పువైపున కూర్చోండి మీరు స్నానపానాదులుగావించి మీ పూజగదిలో తూర్పువైపున కూర్చోండి. చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి. కలశాన్ని ఉంచండి. నెయ్యితో దీపాలు వెలిగించండి. భూమి, కలశాన్ని పూజించండి. కుబేరుని యంత్రం విఘ్నాలను తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయండి. కుబేరుని యంత్రం, ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచండి. ధాన్యం, బెల్లం అర్పించండి. బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పవిత్ర నీటితో స్నానం చేయండి. 108సార్లు జపించండి కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించండి. 
ఐదుసార్లు
 ఓం గం గణపతయే నమః అని జపించండి.

ఓం శ్రీ కుబేరాయ నమః , 
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః 

అనే మంత్రాలను తులసిమాలతో 108సార్లు జపించండి. ఇంట్లో స్వస్తిక్ గుర్తునుంచండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చంటున్నారు జ్యోతిష్యులు.

శ్రీ లక్ష్మీ కుబేరపూజ
ఐశ్వర్యానికి అధిపతియైన కుబేరుని భక్తితో పూజించుకునేవారికి సకల సంపదలతోపాటు ఆయురారోగ్యభాగ్యాలు కలుగుతాయి. శుక్రవారంనాడు శ్రీలక్ష్మీ కుబేరపూజ చేస్తే మంచిది. అష్టమి, నవమి తిథులులేని శుక్రవారమైతే మరీ మంచిది. శుక్రవారంనాడు శ్రీలక్ష్మీ కుబేరపూజ చేయాలనుకున్నవారు ముందురోజు పసుపుకుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, ఫలపుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటిపండ్లను సేకరించుకోవాలి. శుక్రవారంనాడు ఉదయాన్నే తలంటిస్నానం చేసి రాహుకాలం, యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి.
ముందుగా శ్రీ లక్ష్మీ కుబేరస్వామివార్ల చిత్ర పటాన్ని పీటపై పెట్టి, దానిని పసుపుకుంకుమలతో అలంకరించాలి. ఆ పటానికి ముందు అరటిఆకును పరచి, దానిపై నవధాన్యాలను పోసి, పలచగా సర్ది, దానిమధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీరు పోయాలి. ఆ నీటిలో కాస్తంత పసుపు కలపాలి. తర్వాత చెంబులో మామిడాకులను నిలిపి, వాటి మధ్య పసుపు పూసిన కొబ్బరికాయను పెట్టాలి. అనంతరం పూజాద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పటానికి ముందు ఉంచాలి. అనంతరం పసుపుముద్దతో వినాయక ప్రతిమలా చేసుకుని, అరటి ఆకుపై కుడిప్రక్కన అమర్చాలి. పసుపుముద్దగా ఉన్న వినాయకునికి కుంకుమను పెట్టి దీపారాధన చేసి, వినాయక ప్రార్ధన చేయాలి. ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి.
సరసిజ నిలయే, సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి, హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
అని స్తోత్రం చేసిన తర్వాత,

ఓం దనద సౌభాగ్య లక్ష్మీకుబేర
వైశ్రవణాయ మమకార్య సిద్ధిం కురుస్వాహా

అనే మంత్రాన్నిస్తోత్రం చేయాలి.

ఇలా మంత్రం చదివిన తర్వాత సాంబ్రాణి వెలిగించి, ధూపం వేసి, ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింపజేయాలి. పండ్లను నైవేద్యంగా సమర్పించిన పిదప, కర్పూరహారతిని ఇస్తూ గంట మ్రోగించాలి. అలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పండ్లను, తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు పంచాలి.
keywords:
Kubera Puja,Kubera Puja in telugu,Kubera Pooja in telugu,Laxmi Kubera Pooja Vidhi in telugu,Lakshmi Kubera Pooja In Telugu,Kuber Yantra ,kuberuni pattanam name,Lord Kubera,kubera in telugu,lakshmi kubera stotram in telugu pdf,kubera mantra,powerful kubera mantra for money,kubera ashtakam in telugu pdf download,sri lakshmi kubera mantra free download,kubera ashtakam pdf,kubera padal,kubera money mantra,Lord Kubera Mantra 
ఒక్కసారి ఈ మంత్రాన్ని వింటే అపార కుభేరులు ,What is Kubera Deepam? ,Dharma Sandehalu,Bhakthi TV
How to Draw Kubera Kolam ,కుబేర ముగ్గు ,How to do pooja to kubera procedure for kubera pooja
Talapatram,Lakshmi Kubera Vratha Vidhanam - Lakshmi Kubera Vratam (Telugu),కుబేరుడికి అంత సంపదలెలా వచ్చాయో తెలుసా? ,కుబేరుడిని ఇలా పూజిస్తే సంపదలు ఇస్తాడట! ,శ్రీ లక్ష్మీ కుబేరపూజ,how to pray lord kubera and Kubera pooja,Lakshmi Kuber pooja in telugu,which direction is kubera in telugu,direction of kubera in house,direction of kubera,direction of kubera in telugu,Which Side we Keep Pictures of Lakshmi Kubera

Comments