Why Do People Ring The Bells In Hindu Temples ? | Dharma Sandehalu

మనలో చాల మంది తరచూ గుడికి వెళ్తుంటాం, గుడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఉండే గంట కొట్టడం జరుగుతుంది. కానీ, గుడిలో గంట ఎందుకు కొడుతారో మీకు తెలుసా? తెలుసుకోవాలని ఉందా?

‘ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసామ్‌ 
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనామ్‌’
అంటే సద్గుణ దైవీ పరమైన శక్తులు నాలో ప్రవేశించుగాక! నా గృహంలోనూ, హృదయంలోనూ అసురీ శక్తులు వైదొలుగుగాక! అనే ప్రార్థన ఘంటారావంలో చేస్తాం. 

గుడికి వెళ్ళిన వారు తప్పనిసరిగా గంట కొడుతారు. ఇంట్లో లేక గుడిలో పూజ చేస్తున్నప్పుడు, హారతి ఇచ్చే సమయం లో గంట కొడుతారు. ఆలయం లో ఉన్న గంటలలో అర్దాలు చాలానే ఉన్నాయి. దేవాలయం వెళ్ళినప్పుడు గంట కొడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమేకాక, సకల శుభాలు కలుగుతాయి.

గంట విషయానికి వస్తే… గంటలోని ప్రతి భాగానికి ఓ ప్రత్యేకత ఉంది, అదేంటంటే…

గంట నాలుక లో సరస్వతీ మాత కొలువై ఉంటుందట. గంట ఉదర భాగంలో మహారుద్రుడు, బ్రహ్మదేవుడు ముఖ భాగంలోను, కొన భాగంలో వాసుకి మరియు పైన వుండే పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి . అందుకే గంటను పవిత్రంగా భావించి దైవంగా పూజించాలి.
మనకు భాదలు, మనశ్శాంతి కలిగినపుడు, మన మనస్సును ఆధ్యాత్మిక భావనతో నింపాలంటే భగవంతుని ముందు కంచు తో చేసిన గంటను మ్రోగిస్తే, ఆ గంట నుండి వచ్చే “ఓంకార” శబ్దం వలన దుష్ట శక్తులు దూరంగా పోయి, మన బాధలు తొలగుతాయని “కర్మ సిద్దాంతం” మనకు తెలుపుతుంది.
“హారతి” సమయంలో గంటకొడితే, మన ఇంటిలో లేదా దేవాలయం లో దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని అర్ధం. హారతి సమయంలో గంట కొట్టే సమయంలో కళ్ళు మూయరాదు. ఆ సమయం లో హారతి ఇస్తూ, గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని అర్ధం.

గంట మోగిస్తే వచ్చే శబ్దం మంగళకరమైనదని చెబుతారు. భగవంతుని దర్శనానికి ముందు మనసు లోపల, బయట కూడా మెలకువ, శ్రద్ధ పెంచుకోవడానికి గంట మోగిస్తాం.

హారతి ఇచ్చే సమయంలో కూడా గంట మోగిస్తాం. భక్తుల ఏకాగ్రత చెదరగొట్టే శబ్దాల నుంచి ఘంటానాదం, మంగళవాయిద్యాల శ‌బ్దం బయటపడేస్తాయి.

Keywords:
Why Do People Ring The Bells in Temple?,భక్తులు గుడిలో గంటలు ఎందుకు కొడతారు?,Why Do Hindus Ring Bell In Temple,Why Do People Ring The Bells in Temple?,భక్తులు గుడిలో గంటలు ఎందుకు కొడతారో తెలుసా? The Scientific Reason Behind Bells ring in Hindu Temple,Bells,Ganga Harathi,Harathi images,Temples,Bhakti,Ghanta,Ghantalu,Ganta

Comments