What is Gotra In Telugu | Dharma Sandehalu | Bhakti Tv

గోత్రమంటే ఏమిటి? గోత్రం ప్రాముఖ్యత ? దాని వలన ఉపయోగం?

గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. గోత్రము అనగా గో అంటే గోవు, గురువు,భూమి, వేదము అని అర్థములు.
ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు. తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు. 
ఆ తరువాత భూములను కలిగిన బోయ/క్షత్రియులు భూపని, భూపతి, మండల అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు. ముఖ్యముగా బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద, ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు. గోత్రాలు ఆటవిక కాలము/ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి.
తొలుత గోత్రములను బ్రాహ్మణులు,వైశ్యులు , క్షత్రియులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి)పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి(మూల పురుషుడు) చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి. 
క్రైస్తవుల మతగ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి.
keywords:
What is Gotra in Hinduism. Gotras Origin Significance and Importance of Gotra 
గోత్రం అంటే ఏమిటి ? ఎలా వచ్చిందో తెలుసా ?, What is Gotra in Hinduism,What is Gotra?,If Don't Know Gotra Then doing Worship with Gotra,Gotram,History Of Gotra, History Of Gotra in Hinduism,hindu,Imporatnce Of Gotra,Significations Of Gotra,Significations Of Gotra in telugu,Gotram in telugu,What is Gotra system? Why do we have this?,Dharma Sandehalu,Bhakti,how to know gotra

Comments