దేవునికి భక్తులు తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి?
చాలా దేవాలయాల్లో భక్తులు తలనీలాలు ఇవ్వడం అనేది ఎప్పటినుంచో ఉన్న ఆచారం. ముఖ్యంగా, ఈ ఆచారం తిరుమలలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. తిరుమలలో దేవునికి కల్యాణకట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.
దేవుడికి తలనీలాలు సమర్పించడమే సంప్రదాయాన్ని వేదకాలం నుంచి భారతీయులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో కేశఖండనకు ప్రాధాన్యత ఉంది. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.
కలియుగంలో మనుషులు చేసే పాపాలను తొలగించేది కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి. అందుకనే ఆయన సన్నిధానంలోనే తలనీలాలు సమర్పించడానికి భక్తులు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
శిరోజాలు పాపాలకు నిలయమని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిని దైవానికి సమర్పిస్తే మన పాపాలను తొలగించుకుంటామని నమ్మకం. శిశువు జన్మించినప్పుడు ముందు తల భాగం బయటకు వస్తుంది. తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి.
అందుకే చిన్న వయసులో కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను తనలో దాచుకున్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతుడికి తలనీలాలు సమర్పిస్తామని భక్తితో మొక్కుకుతాం. ఒక విధంగా చెప్పాలంటే మన శిరస్సును దైవానికి అర్పించడానికి బదులు తలనీలాలను ఇస్తాం.
ఇక తిరుమలలో శ్రీవారికి కేశఖండన చోటును కల్యాణకట్ట అంటారు. హిందూ సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభం పలకాలనేది పెద్దల భావన. అందుకే క్షవరానికి బదులు కల్యాణమని ఉచ్చరించాలని జనమేజయుని సోదరుడు శతానీకుడు సూచించాడు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చి, కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. ‘వేం’ అంటే పాపాలు.. ‘కట’ అంటే తొలగించేవాడు. కాబట్టే శ్రీనివాసుని కలౌ వేంకటనాయక అయ్యాడు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకే ఆయన సన్నిధానంలో శిరోజాలు సమర్పించడానికి అంతటి ప్రాధాన్యత ఉంది.
దీని గురించి మహాభారతంలో ఓ సంఘటన చోటుచేసుకుంది.
మహాభారతంలో ఓ సంఘటన:
కౌరవుల సోదరి దుశ్శలను పాండవులు సైతం ఎంతగానో అభిమానించారు. ఆమెకు సింధు దేశపు రాజు జయద్రధుడి (సైంధవుడు)తో వివాహం జరిగింది. కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు ఒప్పందం ప్రకారం వనవాసానికి వెళ్లారు. పాండవుల లేని సమయంలో వరసకు సోదరి అయ్యే ద్రౌపదిని సైంధవుడు అపహరించి, తన రథంపై బంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన పాండవులు సైంధవుడిని అడ్డుకుని, ద్రౌపదిని విడిపించారు. ఆవేశంతో భీముడు అతడిని సంహరించబోతే ద్రౌపది వారించింది.
సైంధవుడిని చంపితే మీరు ప్రేమగా చూసుకున్న సోదరి దుశ్శల వెధవరాలిగా మారుతుందని అనడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అతడి తల వెంట్రుకలను తీసేస్తే, తలతీసేసినంత పనవుతుందని ధర్మరాజు చెప్పడంతో గుండు గీసి, అవమానించి పంపుతారు. ఈ అవమానభారంతో పాండవులపై ప్రతీకారం తీర్చుకోడానికి సైంధవుడు కఠోర తపస్సు చేశాడు.
Related Postings:
Keywords:Talaneelalu,Sri Balaji Temple Tirumala Tala Neelalu you never seen video,Talaneelalu in telugu,TTD Talaneelalu,talaneelalu in tirumala,talaneelalu in english,puttu ventrukalu
,దేవుడికి తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి.,Why We Offer Talaneelalu (Hair) to God?, Dharma Sandehalu,తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు,Talaneelalu,Talanilalu Images,Talaneelalu History,,Why We Offer Talaneelalu to God in Telugu?,తలనీలాలు తిరుపతిలో కాకుండా ఇతర క్షేత్రాలలో కూడా సమర్పించవచ్చా? - ధర్మ సందేహాలు,Belief behind donating hair at Temples,Download Belief Behind Donating Hair At Temples,Why do we offer hair to God ?Devotees donating hair at Tirumala demand for barber services ,Tirumala,Tirupati,Lord balaji,Download Belief Behind Donating Hair At Temples ,Why are Talaneelalu Gives to Bhagavan




Comments
Post a Comment