తులిసి పూజ ఎందుకు చేస్తారు? ఫలితం ఏంటి..?
పండగలన్నీ జనజీవితాన్ని ప్రభావితం చేసేవే. కార్తీక మాసం నెల రోజులూ పండగ వాతావరణమే. ఈ మాసంలో భక్తులు జపం, దానం, ఉపవాసాది పుణ్యకర్మలతో ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు. కార్తీక మాసానికే ‘ఊర్జమాసమ'ని పేరు. ఊర్జము అంటే పుణ్యం అని అర్థం. హరిహరులకు ప్రీతికరమైన కారీకాన్ని సూక్ష్మధర్మ ప్రబోధితమైనదిగా అభివర్ణిస్తారు. కార్తీక మాస ప్రాశస్త్యం పద్మ, స్కాంద పురాణాల్లో విశేషంగా పేర్కొన్నారు.
ఇది సద్గతికి నూతన మోక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టుకు పూజలు చేయడం ఈ మాసపు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా తులసి పూజ. మరి తులసి పూజ విశిస్టత, మరియు తులసి పూజ వల్ల పొందే ఫలితం గురించి తెలుసుకుందాం...
తులసి పూజ యొక్క విశిష్టత!
జగన్మాతకి కొన్ని అంశాలున్నాయి. వాటిల్లో తులిసి విశేషమైనది.
ఈమె విష్ణుమూర్తి పాదాల వద్ద నివాసం ఏర్పరచుకొన్న సాధ్వీమణి, విష్ణుమూర్తికి అలంకరా స్వరూపినిగా ఉంది. ధైవారాధనకు ఉపయోగించే సమస్త పుష్ప, పత్రాలన్నింటిలోకి ఇది చాలా ఉత్తమైమనది. తులసి మొక్కను చూడటం వల్ల, స్పర్శ చేత తపస్సంకల్ప పూజాదులు సిద్దిస్థాయి. సమస్త తీర్థాలనూ పవిత్రం చేస్తూ, పరమ పావనియై, దోషాలను దహం చేసే అగ్ని స్వరూపిణి తులసి. మానవులు చేసే సత్కర్మలన్నీ సఫలమవ్వాలంటే తులసి ఉండితీరవలసిందే.
సర్వకామద, మోక్షద, అయిన తులసి భారతదేశంలో అవతరించిన కల్పవ్రుక్షం. ఇది ఉన్నవారి ఇంట ఆయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం వర్థిల్లుతాయి. కార్తీకా మాసంలో వచ్చే ద్వాదశి రోజున తులసి కోటలో ఉసిరి కొమ్మను నాటి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు.
సర్వకామద, మోక్షద, అయిన తులసి భారతదేశంలో అవతరించిన కల్పవ్రుక్షం. ఇది ఉన్నవారి ఇంట ఆయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం వర్థిల్లుతాయి. కార్తీకా మాసంలో వచ్చే ద్వాదశి రోజున తులసి కోటలో ఉసిరి కొమ్మను నాటి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు.
చలిమిడితో చేసిన ప్రమిదల్లో ఆవునేతితో దీపాలు పెడతారు. క్షీరాబ్ది ద్వాదశినాటి సాయంకాలం వేళ తులసి కోట ముందు దీపాలు వెలిగించిన ఇంట కలకాలం ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. క్షీరాబ్ధి ద్వాకార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యాస్తమయం తర్వాత స్నాన, దాన పూజాదులు చేసిన వారికి అధిక ఫలం కలుగుతుంది. కార్తీకమాసం ఒక్కోరోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ప్రతి పూజా హరిహరుల అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. అలాంటి కార్తీకమాసంలో చెప్పబడుతోన్న విశిష్టమైన పూజల్లో 'తులసి పూజ' ఒకటిగా కనిపిస్తుంది. సాధారణంగా చాలామంది ఇళ్లలో తులసికోట కనిపిస్తూ వుంటుంది.
స్నానం చేయగానే తులసిమొక్కకు ప్రదక్షిణలు చేసి పూజిస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న తులసిని, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తుంటారు. కార్తీకమాసంలో లక్ష్మీనారాయణులు తులసికోటలో కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగా కార్తీకంలో తులసిపూజ మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తే నట్టింట్లో సిరులవాన కురుస్తుంది. కార్తీకమాసంలో తులసిని పూజించడం వలన కూడా ఇదే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.
ఈ మాసంలో తులసిని పూజించడం వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోయి, సంపదలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది. దుష్ట ప్రయోగాలు ... విషకీటకాలు దరిదాపుల్లోకి రానీయకుండా చేసే శక్తి తులసికి వుంది. ఇంటికి తులసి రక్షణ కవచమనీ ...కోరికలను నెరవేర్చే కల్పవృక్షంతో సమానమని అంటారు. ఆరోగ్యంతోపాటు ఆర్ధికపరమైన అభివృద్ధిని వరంగా ప్రసాదించే తులసిని కార్తీకంలో పూజించడం ఎలాంటి పరిస్థితుల్లోను మరిచిపోకూడదు.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
keywords:
Pooja Vidhanam, పూజ ఇలా చేయండి చాలు ,నిత్యపూజా విధానం,తులసి మొక్క ప్రయోజనాలు మరియు ఉంచవలసిన స్థానం, Benifits & Importance Of Tulasi Plant, for tulasi pooja , tulasi pooja ,about tulasi plant in telugu,tulsi pooja procedure in telugu,తులసీపూజ ,tulasi pooja,The Importance of Tulasi Pooja in Karthika Masam,Tulasi Puja,dwadasi tulasi pooja in telugu pdf,తులసి మాత వివాహ పురాణం , Tulsi matha marriage story in Telugu, Pooja vidhanam, Karthika Pournam,Tulasi Pooja,Puja Vidhi,Tulasi puja Vidhi in telugu,how to do tulasi puja at home in telugu
Comments
Post a Comment