పూజ గది ఏ దిక్కున ఉండాలో తెలుసుకోండి
ఇల్లు నిర్మించిన తీరును బట్టే అక్కడ నివసించేవారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని ఆయా గదుల మాదిరిగానే పూజాగది విషయంలోనూ కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఉన్నాయి.
దీని ప్రకారం పూజామందిరాన్ని ఇంటిలో ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తరదిక్కుల మధ్య ఉన్న ప్రాంతమే ఈశాన్యం. పూజ గది నిర్మాణానికి ఇదే అత్యుత్తమైన స్థానం.
ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం మూలంగా అక్కడ చేసే ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. ఈ గదిలో పూజ చేసుకునేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కులకు తిరిగి కూర్చోవడం మంచిది. అంటే దైవాన్ని పడమటివైపు కానీ.. దక్షిణం వైపు కానీ ఉండేలా అమర్చుకోవాలి. ఇంటివైశాల్యాన్ని బట్టి వీలు లేకపోతే అల్మరా వంటిది పెట్టుకోవచ్చు.
అయితే కనీసం ఒక్క ప్రతిమ లేదా ఫొటో అయినా ఈశాన్య దిక్కున ఉంచుకోవాలి. ఇక పూజగదికి తప్పనిసరిగా గడప ఉండాలి. గంటలతో తలుపును ఏర్పాటచేస్తే మంచిది.
నైరుతి, ఆగ్నేయ మూలల్లో పూజగదులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
Related Postings:
keywords:
Where To Place The Pooja Room In Your Home,Telugu Vastu ,Unused places in your home that could be a Pooja space, Vastu Tips for PUJA ROOM,Pooja rooms For MORE Updates,పూజగది వాస్తు ఎలా ఉండాలి..? , Pooja Gadi, Vastu Tips For Pooja ,Pooja Room Vastu In Telugu, Vastu Tips,పూజ గది ఏ దిక్కున ఉండాలో తెలుసుకోండి ..,పూజామందిరం ఏ దిశలో ఉండాలి ,Vastu Tips for Keep Pooja Room in Your Home,Home ,pooja Room,vastu shastra,పూజామందిరం ఏ దిశలో ఉండాలో తెలుసా?,simple pooja room designs in wood,wooden room designs ,pooja room designs,Vastu,Vastu Sastra,Pooja Samagri,Pooja Iteams,pooja Mandhir,Pooja Mandir
Comments
Post a Comment