తీర్థం మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి ఎప్పుడైనా ఆలోచించరా?
తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోనూ, దేవాలయంలోనూ లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది చాలామందికి తెలియదు.
దేవునికి పూజల చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతోంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత మెరుగవుతాయి.
మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.
రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి. మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం.
దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుందని అంటారు. తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి.
ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది. నా ఆరోగ్యానికి, నా ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుంది అని సద్భావంతో తీసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
తీర్థం మూడుసార్లే ఎందుకు! Why Teertham Gives 3 Times - Significance Of Teertha,Why should we take Theertham 3 times, తీర్థం మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి ఎప్పుడైనా ఆలోచించరా?.తీర్థం సేవించిన తర్వాత తలపై రుద్దకూడదు.. ఎందుకు..?,Dharma Sandehalu,Pooja Vidhi,


Comments
Post a Comment