గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు:
సాధారణంగా ఎవరైనా గర్భం దాల్చారని తెలిసిన వెంటనే, ఆమెకు చాలా సలహాలు అందుతుంటాయిప. అమ్మలు, అమ్మలు, ఇరుగు పొరుగువారు, డాక్టర్స్ ఇలా ఒక్కరేంటీ అందరి దగ్గర నుండి కావల్సినన్ని సలహాలు ఇస్తుంటారు. అందులో సగానికి సగం నిజాలు, వారి వారి అనుభవాలను ఇలా ఇతర గర్భీణీ స్త్రీలకు సలహాల రూపంలో ఇస్తుంటారు. అంతే కాకుండా మొదటి సారి గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి సందేహాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గర్భం దాల్చిన వెంటనే ఆ స్త్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఎలాంటి డెఫిషియన్సీకి లోనుకాకుండా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వారు నిర్దేశించిన సమయాలలో తనిఖీలు చేయించుకుంటూ ఉండాలి. తల్లి గర్భం సురక్షితమైనదే అయినప్పటికీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు అటువంటి స్త్రీలు చేయకూడని కొన్ని పనుల గురించి మన దేశంలో చాలామందికి పూర్తి అవగాహన లేదనే చెప్పాలి. కాబట్టి మేము అందిస్తున్న ఈ చిన్న చిట్కాలన్నీ గర్భిణీ స్త్రీకి సంబంధించినవే. గర్భిణీ స్త్రీలలో అనేక హార్మోను మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ధైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోండి ... థైరాయిడ్ పనిలో ఎచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్యవల్ల గర్భస్రావం జరగవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి . మొదటి ఆరునెలలు ... నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము . సొంతముగా మందులు వాడడము, ఎక్షురేలు తీయించుకోవడము చేయకండి . ఎత్తుమడమల చెప్పులు వాడకంది, గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు . రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి . స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును. ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌లు తీసుకోవాలి . రక్తస్రావము, ఉమ్మనీరు పోవడము, శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు, కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .
గర్భవతులకు - పోషకాహారం, గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -
భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఒకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.
నష్టాలు
1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది.
2. శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది.
3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.
గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది. గర్భవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్దాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది. గర్భవతులు, బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అ వసరం. గర్భ స్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పు సమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువుతో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి:
1. గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి.
2. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది.
3. ముడిధాన్యాలు, మొలకెత్తినధాన్యాలు, పులిసిన ఆహారం (పెరుగు ) అదనంగా తీసుకొవాలి.
4. పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి.
5. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .
6. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.
7. ఐరన్, ఫోలిక్ / కాల్షీయాన్ని (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
8. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువుపనులు చెయ్యరాదు, అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా.
9. పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు.
10. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు.
11.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది, గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
12. భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి .
13. గర్భము దరించిన నుండి, బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు
గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి?
1.గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేలలూ ప్రశాంతముగా వుండాలి.
2.మీకుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి .
నీతి కథలను చదువుతు వుండాలి.
3.గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
గర్భిణులు నిద్రలో కొన్ని సమస్యలు-జాగ్రత్తలు :
1.గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
2.గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. .
కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు ..
3.పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
4.పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
5.నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడని మందులు:
ఈ ఆధునిక వైద్యయుగంలో మాత్రలు, సూదులు, టానిక్లు ఒక విధంగా చూస్తే వరం లాగా, మరోరకంగా చూస్తే శాపం లాగా కనిపిస్తుంటాయి. టైఫాయుండ్, మలేరియా, క్షయ, గుండెపోటు లాంటి విషమ వ్యాధుల నుంచి మనవి కాపాడగలిగేవి ఈ మందులే. అలాగే విచక్షణ లేకుండా ఇష్టమొచ్చినట్లు వాడినప్పుడు మనల్ని భయంకరమైన సమస్యలకు గురిచేసేవీ ఈ మందులే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవటం వలన జరగబోయే హాని గురించి తలుసుకొందాం.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
గర్భవతి, గర్భిణీ స్త్రీ తెలుసుకోవల్సిన 12 ఆరోగ్య చిట్కాలు, గర్భిణీ స్త్రీ తెలుసుకోవల్సిన జాగ్రత్తలు,గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు,చంద్ర గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు,What are Rules to be Followed By Pregnant Women and Children during Grahanam?,గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రావొచ్చా..? Chandra Grahanam ,Grahanam,Best Pregnancy Health Tips In Telugu ,Pregnant women,Pregnant,Best Pregnancy time Health Tips In Telugu,Pregnant women are aware of the precautions,Rules for pregnant women to follow in telugu




Comments
Post a Comment