ఓంకారేశ్వర జ్యోతిర్లింగం | Omkareshwar jyotirlinga temple history in telugu | Omkareshwar Temple History In Telugu | 12 Jyotirlingas | Bhakthi Margam

ఓంకారేశ్వరం

సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు. నర్మదా నదీమతల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది.ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం. ఆత్మ, పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర్‌ ప్రణవలింగముగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగముగా ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం.
మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఓంకార క్షేత్రం ఉంది. దీనిని ఓంకారేశ్వర, అమలేశ్వర లింగ క్షేత్రమని కూడా పిలుస్తారు. నర్మదానది పై పడవల ద్వారా ఓంకార క్షేత్రాన్ని చేరుకోవచ్చు. నిర్మలమైన నదీ జలాల పై పడవ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.
అతి పురాతన జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం భక్తుల పాలిట ఇలకైలాసంగా చెబుతుంటారు. ఈ ప్రధాన ఆలయంలోని పరిశుద్ధనాథ్‌, వైద్యనాథ్‌, మహాకాళేశ్వర్‌, కేదారీశ్వర్‌, గుప్తనాథ్‌ పేర్లతో వివిధ ముఖాలయాలు ఉన్నాయి. ఈ అయిదు ఆలయాలను పంచలింగ దామాలుగా పిలుస్తారు. నిత్యం నర్మదా నదీ జల ప్రవాహంతో పునీతమయ్యే ఈ దివ్యదామాన్ని ఒక్కసారి దర్శించిన చాలు జన్మ ధన్యమైనట్టే. మొదట ఓంకారేశ్వరుడిని, అనంతరం మమలేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రాశస్త్యం.

స్థల పురాణం 
పూర్వం స్వర్గాన్ని దానవులు ఆక్రమించుకుని దేవతలను హింసలకు గురిచేసిన సమయంలో ఇంద్రుడు పరమేశ్వరున్ని పూజించాడు. జ్యోతిస్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాళ లోకం నుంచి లింగాకారంలో వెలసి దానవుల బారినుంచి స్వర్గాన్ని రక్షించి తిరిగి దేవతలకు అప్పగిస్తాడు. నర్మదా నదీ తీరాన బ్రహ్మ, విష్ణువులు కూడా కొలువై ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిపుర క్షేత్రం అంటారు. బ్రహ్మవెలసిన క్షేత్రాన్ని బ్రహ్మపురి, విష్ణువు వెలసిన క్షేత్రాన్ని విష్ణుపురి అంటారు. ఆ పరమేశ్వరుడు వెలసిన క్షేత్రాన్ని రుద్రపురి అని పిలుస్తారు. ఆ రుద్రపురిలోనే మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది.
Temples Timings
5 am to 12 pm
4 pm to 10 pm
పురాణ కాలంలో మాంధాతరాజు ఇంద్రుని ఆశీస్సులతో రాజ్యాధికారాలను స్వీకరిస్తాడు. అతను పరమ శివ భక్తుడు. నిత్యం ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉండేవాడు. నర్మదా నదీ పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి వెలువడి ఆ ఓంకారేశ్వరున్ని నిత్యం అభిషేకిస్తాయి. తరువాతి కాలంలో మాంధాత ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. ఈ ప్రదేశాన్ని ఓంకార మాంధాతగా కూడా పిలుస్తారు. ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ పర్వతంపై అగస్త్యుడు లాంటి గొప్ప మునులెందరో ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి.

హిందూ మతంలో ఓం అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని ఈ జగత్తు మొత్తం ఈ ఓం అక్షరం నుంచే ఏర్పడిందని చెబుతారు. అందువల్లే ఓం అక్షరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అదే విధంగా హిందూ దైవ ఆరాధనలో మొదట ఓం అక్షరాన్నే పలుకుతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆకాశం నుంచి చూస్తే ఈ క్షేత్రం ఓం ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ విశ్వం ఏర్పడటానికి ముందే ఇక్కడ దైవం వెలిసిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందుల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అందువల్లే ఈ క్షేత్రంలోని దైవాన్ని దర్శించడం వల్ల మొక్షం లభిస్తుందని అందరూ భావిస్తారు. వింద్యా పర్వతం గర్వ భంగం జరిగింది ఇదే క్షేత్రంలోనే. అంతేకాకుండా ఈ ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. 

1. నారద మహర్షి ఒకనొక సమయంలో నారదమహర్షి గోకర్ణ క్షేత్రంలోని పరమేశ్వరుడిని పూజించి ఈ ప్రాంతానికి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వింద్యాపర్వతం నారదుడితో వాదనకు దిగుతుంది. ఈ లోకంలో తనకంటే గొప్ప పర్వతం ఏదీ లేదని చెబుతుంది.

 2. మేరు పర్వతంమిగిలిన ఏ పర్వతంలో లేనన్ని రత్నాలు తన లోపల ఉందని గర్వంతో చెబుతుంది. దీంతో నారదుడు నీవు ఆ మేరు పర్వతం కంటే గొప్పవాడవు కాదని చెబుతాడు. మేరు పర్వత శిఖరం స్వర్గం వరకూ వ్యాపించి ఉందని గుర్తుచేస్తాడు.

3. శివుడి గురించి తపస్సు దీంతో సిగ్గు పడిన వింద్యా పర్వతం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది. తాను మేరు పర్వతం కంటే ఎక్కువ ఎత్తుకు పెరగాలని వేండుకొంటాడు. అంతేకాకుండా తన పై నిత్యం నీవే కొలువై ఉండాలని వింద్యా పర్వతం శివుడిని వేడుకొంటుంది.

4. ఓంకారేశ్వరుడిగా బోళా శంకరుడైన ఆ పరమేశ్వరుడు ఇందుకు అంగీకరించి వింద్యా పర్వతం పై ఓం కారేశ్వరుడిగా కొలువుండిపోతాడు. ఇదిలా ఉండగా మేరు పర్వతం కంటే విద్యా పర్వతం ఎక్కువ ఎత్తుకు పెరిగడం వల్ల సూర్యగమనానికి అడ్డుపడుతుంది.

5. చీకటిగా దీంతో ఉత్తర భారతదేశం మొత్తం చీకటిగా మారుతుంది. ఈ పరిమాణంతో సమస్త జీవులు భయపడుతాయి. దీంతో మునులు ఈశ్వరుడిని తమను రక్షించమని కోరుకొంటారు. 
6. అగస్త్యమహాముని  వారి మొరను ఆలకించిన ఆ పరమేశ్వరుడు వింద్యాపర్వతానికి గురువైన అగస్త్యమహముని ఒక్కరే ఆ పర్వతం గర్వం అనచగలడని చెబుతాడు. దీంతో మునులతో పాటు సాధారణ మానవులు మరోసారి అగస్త్యుడిని వేడుకొంటాడు. 

7. దక్షిణానికి బయలు దేరుతాడు దీంతో ఉత్తరభారతదేశంలోని కాశీలో ఉన్నఆ విశ్వేశ్వరుడిని వదలలేక అయిష్టంగానే దక్షిణ భారత దేశానికి ప్రయాణమవుతాడు. అప్పుడు ఈ ఓంకారక్షేత్రానికి అగస్త్యుడి రాగానే తన గురువును చూసి వింద్యా పర్వతం తలవంచి నమస్కరిస్తుంది. 

8. మరలా తిరిగి రాలేదు దీంతో త్వరగా ప్రాంతాన్ని దాటుకొని తాను వచ్చే వరకూ ఆ వంచిన తలను అలాగే ఉంచాలని చెప్పి అగస్త్యుడు దక్షిణ దేశం వైపునకు వెళ్లి మరలా తిరిగి రాలేదు. దీంతో వింద్యా పర్వతం అలాగే తల వంచుకొని ఇక్కడ ఉన్నట్లు చెబుతారు.

9.ఇక వింద్య పర్వతం పైన ఓం కార క్షేత్రంలోని దేవాలయం నాలుగు అంతస్తులో ఉంటుంది. మొదటి అంతస్తులో ఓంకారేశ్వరుడు ఉండగా, అతని పై అంతస్తులో మహా కాలేశ్వరుడు ఉంటాడు .

10అనేక ఉపాలయాలు  మూడో, నాలుగో అంతస్తులో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఇక ఇక్కడ ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉంటుంది. మనం శివలింగాన్ని అభిషేకించిన వెంటనే ఆ అభిషేక జలం ఆ చీలిక ద్వారా వెళ్లి నర్మదానదిలో కలుస్తుంది. 

11. పడమర దిశగా  అందువల్లే నర్మదానది హిందువలుకు అత్యంత పవిత్రమైన నదిగా పేరొగాంచింది. ఇదిలా ఉండగా సాధారణంగా భారత దేశంలోని చాలా నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిస్తే నర్మదానది మాత్రం పడమర దిశగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది.

12. అమలేశ్వర లింగం  ఓంకార లింగానికి ఎదురుగా అమలేశ్వర లింగం ఉంది. ఇక్కడ శివలింగానికి జరిగే సహస్ర శివలింగపూజకు చాలా ప్రత్యేకం ఉంది. ఈ పూజను భక్తులు నేరుగా చేయవచ్చు. అందువల్ల పూజా ఫలం మొత్తం భక్తులకు దక్కుతుందని భావిస్తారు.

ఆలయ విశిష్టత 
ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తరువాతి కాలంలో వివిధ రాజ్యవంశాలు ఆలయాన్ని పునఃనిర్మించారు. రాణి అహల్యాదేవీ హోల్కర్‌ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించారు. ఇక్కడి ఆలయ గోపురం ఒక పక్కకు ఒరిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆర్జిత సేవలుగా పరిగణిస్తారు. ఓంకారేశ్వర దర్శనం అనంతరం భక్తులు నర్మదా నది అవతల వైపు ఉన్న మమలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మమలేశ్వర ఆలయంలో సైతం ఉప ఆలయాలు ఉన్నాయి. గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగం రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ స్వామివారినే అమలేశ్వరుడు అనికూడా అంటారు. ఈ రెండు పవిత్ర లింగాలను దర్శించనంతనే తమ జన్మ ధన్యమవుతుందని భక్తులు పరవశులవుతారు.

ఉత్సవాలు 

ప్రతీ ఏడాది ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళ ప్రత్యేకమైనది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు కొలువుదీరి నర్మదా నదిలో మేళతాళాల నడుమ జలవిహారం చేస్తారు. అనంతరం నదీ మధ్యలో ఒకచోట ముమ్మార్లు ప్రదిక్షణ చేస్తారు. శ్రావణమాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఉత్సవాల విషయానికొస్తే శ్రావణమాసంలో తిరునాళ్లు, కార్తీకమాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు లక్షల సంఖ్యలో భక్తుల హాజరవుతారు.

ఎలా చేరుకోవచ్చు 
* మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి ఈ క్షేత్రం 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
* ముంబయి, దిల్లీ, గ్వాలియర్‌, భోపాల్‌ నుంచి ఇండోర్‌కు విమాన సర్వీసులను నడుపుతున్నారు. 
* ఇండోర్‌ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో రాట్లాం-ఖాండ్వాకు రైలు మార్గం ఉంది. దిల్లీ ముంబయిల నుంచి కూడా రైలు సౌకర్యం ఉంది. 
* ఇండోర్‌ నుంచి ఉజ్జయిని, ఖాండ్వాకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. హైదరాబాద్‌ నుంచి అయితే 772 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేరుగా భోపాల్‌ లేదా ఇండోర్‌ వెళ్లి అక్కడి నుంచి ఓంకారేశ్వర్‌కు వెళ్లవచ్చు.


Omkareshwar Temple Address:

Omkareshwar,Tehasil Punasa
Khadwa District- Pin : 450554
Madhya Pradesh

Phone: 07280271228

Keywords:
ఓంకరేశ్వర దేవాలయం,omkareshwar temple,ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం ,Omkareshwar Jyothirlinga,12 Dwadasha jyotirlinga Temples of Lord Shiva,Madhya Pradesh ,Jyotirlinga, 12 Shiva Temples in India,12 జ్యోతిర్లింగాలు,Lord Shiva Temples,Famous Temples ,Rooms And Accommodation,online Rooms Bookings,12 Jyotirlingas,Jyotirlingas in telugu,Omkareshwar In Telugu,omkareshwar History In telugu

Comments