Lalitha Sahasranamam In Telugu | Devi Navaratri,dasara Festivals in Telugu | Dasara | 5 th Day Pooja Vidhanam

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పూజ - శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి
శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం


దసరా నవరాత్రులలో 5వ రోజు అమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.
త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు.

శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి


1
ఓం రజతాచలశృంగాగ్ర మధ్యస్థాయై నమః
ఓం హిమాచల మహావంశపావనాయై నమః
ఓం శంకారార్ధాంగ సౌందర్య శరీరాయై నమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః
2
ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః
ఓం సదాపంచదశాత్మైక్య స్వరూపాయై నమః
ఓం వజ్రమాణీక్య కటకకిరీటాయై నమః
ఓం కస్తూరీతిలకోల్లాసిత నిటలాయై నమః
ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః

3
ఓం వికచాంభోరుహ ధళ లోచనాయై నమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః
ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః
ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః
ఓం తాంబూలపూరితస్మేర వదనాయై నమః

4
ఓం సుపక్వదాడిమీ బీజరదనాయై నమః
ఓం కంబుపూగ సమచ్చాయ కంధరాయై నమః
ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమః
ఓం గిరీశబద్ధమాంగళ్య మంగళాయై నమః
ఓం పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమః

5
ఓం పద్మకైరవమందార సుమాలిన్యై నమః
ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమః
ఓం రమణీయ చతుర్భాహు సంయుక్తాయై నమః
ఓం కన కాంగద కేయూర భూషితాయై నమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమః
6
ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః
ఓం దివ్యభూషణ సందోహరంజితాయై నమః
ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః
ఓం సుపద్మ రాగసంకాశ చరణాయై నమః
7
ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః
ఓం శ్రీకంఠనేత్రకుముద చంద్రికాయై నమః
ఓం సచామర రమావాణీ రజితాయై నమః
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
ఓం భూతేశాలింగ నోద్భూత   పులకాంగ్యై నమః


8
ఓం అనంగభంగ జనకాపాంగవీక్షణాయై నమః
ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్నరంజితాయై నమః
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః
ఓం లీలాకల్పితబ్రహ్మాండ మండలాయై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
9
ఓం ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
ఓం దేవర్షిభిస్సూయమానవైభవాయై నమః
ఓం కలశోద్భవ దుర్వాసః పూజితాయై నమః
ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్రవత్సలాయై నమః
10
ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమః
ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః
ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమః
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః
ఓం వందారు జనసందోహ వందితాయై నమః
11
ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః
ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః
ఓం అవ్యాజకరుణా పూరపూరితాయై నమః
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః
12
ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమః
ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమః
ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః
ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః
ఓం మహాపాపౌఘ పాపానం వినాశిన్యై నమః

13
ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః
ఓం సమస్తదేవదనుజప్రేరకాయై నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః
ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః
ఓం సహస్రారసరోజాత వాసితాయై నమః

14
ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమః
ఓం వాణీగాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
ఓం రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై నమః
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః
ఓం సహస్ర రతిసౌందర్య శరీరాయై నమః

15
ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః
ఓం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్దిదాయై నమః
ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః
ఓం శ్రీసుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమః
ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమః

16
ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః
ఓం చంద్రశేఖర భక్తార్తిభంజనాయై నమః
ఓం సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమః
ఓం నామపారాయణ అభీష్టఫలదాయై నమః
ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమః

17
ఓం శ్రీషోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమః
ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః
ఓం భక్తహంసపరాముఖ్య వియోగాయై నమః
ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః
ఓం భండదైత్య మహాసత్త్వ నాశనాయై నమః
18
ఓం క్రూరభండ శిరశ్చేద నిపుణాయై నమః
ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమః
ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమః
ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై నమః

19
ఓం అభ్రకేశమహోత్సహ కారణాయై నమః
ఓం మహేశయుక్త నటనా తత్పరాయై నమః
ఓం నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమః
ఓం వృషభద్వజ విజ్ఞానభావనాయై నమః
ఓం జన్మమృత్య జరారోగ భంజనాయై నమః

20
ఓం విధేయముక్త విజ్ఞానసిద్దిదాయై నమః
ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమః
ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః
ఓం సర్వవేదాంత సంసిద్ద సుతత్త్వాయై నమః
ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై నమః

21
ఓం అశేష దుష్ట దనుజసూదనాయై నమః
ఓం సాక్షాచ్చ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః
ఓం హయమేధాగ్రసంపూజ్య మహిమాయై నమః
ఓం దక్షప్రజాపతి సుతావేషాఢ్యాయై నమః
ఓం సుమబాణేక్షుకోదండ్మండితాయై నమః
22
ఓం నిత్యయౌవన మాంగళ్యమంగళాయై నమః
ఓం మహాదేవ సమాయుక్తశరీరాయై నమః
ఓం మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై నమః
విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయప్రవేశం చేయగల దిట్ట. అటువంటి ఒక అవతారమే ఇప్పుడు మనకు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అదే జగన్మోహినీ అవతారం. ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' ! ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. 

ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం కలదు. రాజమండ్రి కి 40 కి. మీ ల దూరంలో, కాకినాడ కు 74 కి. మీ ల దూరంలో, అమలాపురం కు 34 కి.మీ ల దూరంలో వశిష్ట, గౌతమీ అనే గోదావరి ఉప పాయల నడుమ ర్యాలీ గ్రామము కలదు. 


విష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తినట్లు శ్రీమహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహినీ అవతారం ఎత్తిన ప్రదేశం ర్యాలీ.  ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఎదురెదురుగా ఉండటం. సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం, తూర్పు గోదావరి ..అమృతం ర్యాలీ స్థలపురాణం గురించి శ్రీ భాగవత ఇతిహాసంలో పేర్కొనబడింది. అదేమిటంటే క్షీరసాగరమధనం సమయంలో దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే.,అమృతం పుట్టింది. 
ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపందాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై..కనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ.., అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.
అమృతం ఉద్భవించినపుడు దేవదానవులు పోట్లాడుచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తి అమృతం అందిస్తాడు. 

అయ్యప్ప జననం జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం రాలి కింద పడుతుంది. ఆ పుష్పం పడిన ప్రాంతం ఇప్పటి ర్యాలీ (ర్యాలీ అంటే పడటం అని అర్థం) అని చెబుతారు. 
చోళరాజు క్రీ.శ. 11 వ శతాబ్దంలో అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేటకై వచ్చి అలసి పోయి ఒక చెట్టుకింద సేద తీరుతాడు. ఆయనకు మహా విష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశం వద్ద తనకు గుడి కట్టించాలని చెబుతాడు. 
విగ్రహం వెంటనే రాజు కలలో నుంచి తేరుకొని ఆ ప్రదేశాన్ని వెతికి తవ్వించగా అక్కడ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడుతుంది. రాజు వెనువెంటనే అక్కడ దేవాలయ నిర్మాణం కావించాడు. గుడి ప్రాకారాలు 1936 లో పునః నిర్మించారు. 
జగన్మోహనుని రూపం అమృతం పంచిన తర్వాత మోహినిని శివుడు మోపిస్తాడు. అతని నుండి తప్పించుకునేందుకు మోహిని రథం ఎక్కి వేగంతో వెళ్ళిందట. అలా వేగంగా వెళుతున్నప్పుడు రథం శీల రాలి పడిపోతుందట. అక్కడే విష్ణువు జగన్మోహనునిగా ఉండిపోయాడట.
ప్రత్యేకత శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం శ్రీమహా విష్ణువు ప్రత్యక్ష రూపం. ఈ విగ్రహం ఏకసాలిగ్రామ శిలతో తయారైంది. ముందువైపు విష్ణువు, వెనకవైపు జగన్మోహిని రూపం కలిగి ఉండటం విగ్రహం ప్రత్యేకత. 
విగ్రహ లక్షణాలు స్వామి పాదపద్మాల మధ్య చిన్న గంగా దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. విగ్రహం ముందువైపు విష్ణువు శంఖం, చక్రం, గద మరియు అభయహస్తం కలిగి ఉండి, విగ్రహం పై భాగాన ఆదిశేషుడు పడగవిప్పి నీడనిస్తున్నట్లు ఉండటం విశేషం. 
పద్మిని జాతి స్త్రీ లక్షణాలు విగ్రహం వెనుక భాగంలో రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి వంటివి కలిగి ఉండి పద్మిని జాతి స్త్రీ లక్షణాలు కలిగి ఉంటుంది. స్వామివారికి జరిగే అన్ని పూజలు, హారతులు విగ్రహం వెనుకల కూడా జరుగుతాయి.
పరమేశ్వరుడు శ్రీ జగన్మోహిని కేశవ స్వామి తూర్పు వైపున ఉండగా ఆయనకు ఎదురూగా పరమేశ్వరుడు పశ్చిమ ముఖం తిరిగి ఉంటాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలంచే పావనం చేయబడినందున పరమేశ్వరుడిని శ్రీ ఉమా కండలేశ్వర స్వామి అని పిలుస్తారు. 
దేవాలయ ప్రాంగణంలో ఇతర విగ్రహాలు శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబర, రంభ, ఊర్వశి, శ్రీకృష, ఆదిశేషుడు, గంగా, గరుడ విగ్రహాల శిల్పకళాచాతుర్యం ఉట్టిపడుతుంది. 
పండుగలు జగన్మోహిని కేశవ కళ్యాణం, శ్రీ రామ సత్యనారాయణ పరిణయం, వేణుగోపాలస్వామి కళ్యాణం, జన్మాష్టమి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు. 
దేవాలయ టైమింగ్స్ ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని తెరుస్తారు.
మీ ప్రయాణంలో ఇవి కూడా చేర్చుకోండి వడపల్లి - శ్రీవెంకటేశ్వర ఆలయం పంచారామ ఆలయాలు - సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం
వసతి రావులపాలెం వసతికి మరియు భోజన సదుపాయాలకు సూచించదగినది. రావులపాలెం - ర్యాలీ మధ్య దూరం కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. 
ఇలా చేరండి ర్యాలీ చేరుకోవటానికి ఎటువంటి టూర్ ప్యాకేజీలు లేవు. కనుక యాత్రికులు రాజమండ్రి విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ లో దిగి ప్రవేట్ బస్సులలో లేదా టాక్సీ లలో ఎక్కి ర్యాలీ చేరుకోవచ్చు.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu



Keyworlds:
Ryali temple,Ryali,East Godavari,Atreyapuram,Ryali Ayyappa Swamy Temple,Sri Jaganmohini Kesava Swamy Temple  ryali,reli,ryeli,ryali temple History in telugu,Ryali In telugu,Lord Vishnu Temples.Lord Shiva Temples,Ayyappa swamy,Sri Jaganmohini Kesava Swamy Temple in telugu,SRI JAGANMOHINI KESAVA & GOPALA SWAMY TEMPLE,Ryali Jagan Mohini Temple History. Temple Timings, address,contact number, website, festivals, Darshan Timings,Route information.Jagan Mohini Keshava swamy temples,A.P,Andrapradesh,Hindu temples,Sabharimala,,ayyappa swamy puja vidhanam In Telugu, ayyappa swamy pooja Procedure In Telugu, Ayyappa Swamy Deeksha Niyamalu,ayyappa swamy pooja Process In Telugu,Ayyappa Swamy Hd Images,
Ayyappa Mala Rules,Ayyappa mala rules in telugu,Ayyappa Swamy Deeksha Niyamalu in Telugu,Ayyappa Swamy Nitya Pooja Niyamalu,ayyappa swamy pooja vidhanam,ayyappa swamy pooja vidhanam In Telugu,ayyappa swamy padi pooja,ayyappa swamy padi pooja Vidhanam in Telugu,ayyappa swamy pooja vidhi in Telugu,ayyappa swamy puja vidhi in Telugu,అయ్యప్పస్వామి దీక్ష నియమాలు,Ayyappa Swamy Mala deeksha niyamalu In telugu,Pooja Niyamalu,Ayyappa Swamy  History In Telugu,Ayyappa Swamy Story In Telugu,ayyappa ashtothram,ayyappa ashtottara shatanamavali in telugu,ayyappa namalu in telugu,ayyappa sahasranamavali,1008 names of ayyappa in Telugu,ayyappa swamy 108 names in Telugu,ayyappa Swamy 108 namalu in telugu, ayyappa sahasranamam, ayyappa Songs,Ayyappa Swamy MP3 Songs,Ayyappa Swamy Latest Songs
,Ayyappa Swamy Birth History

Comments