Importance of Atla Taddi Celebration In Telugu | Atla Thadiya Vratha Vidhanam | Atla Taddi | అట్లతద్ది నోము

అట్లతద్ది నోము ఎలా చేసుకోవాలి? 
అట్లతద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆడవారి ఆనందాల వేడుక అట్లతద్ది. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. “అట్లతద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి.
 
అట్లతద్దిముందురోజు నుంచే ఆడపిల్లలు చేతులకు. పాదాలకూ గోరింటాకు పెట్టుకోవడంతో హడావుడిగా ప్రారంభమవుతుంది. ఎవరి చెయ్యి బాగా పండితే వారికి ప్రేమగా చూసుకునే అందమైన భర్త వస్తాడని కన్నెపిల్లల నమ్మకం. అందుకనే నా చెయ్యి బాగా పండాలంటే, నా చెయ్యి బాగా పండాలని ఆడపిల్లలంతా పోటీ పడతారు. ఇక కన్నెపిల్లల తల్లలు మరునాడు ఉమాదేవికి నివేదన చేసే అట్లు కోసం మినగపప్పు రుబ్బుకోవడం, తెల్లవారుఝామునే తమ పిల్లలు తినే చద్దిఅన్నం,గోంగూరపచ్చడి చేయడంలో నిమగ్నమైపోతారు. తండ్రులైతే.. మరునాడు తమ పిల్లలు ఊగడానికి కావలసిన ఉయ్యాలలను చెట్లకు కట్టడంలో బిజీగా ఉంటారు.


గోరింటాకు ప్రాముఖ్యత

అట్లతద్ది నోములో గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అట్లతద్దె ముందురోజున నోము చేసుకునే ఆడపిల్లలు చేతులకు, కాళ్ళకు గోరింటాకు అలంకరించుకోవాలి. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెబుతారు. గోరింటాకు వాళ్ళు అలంకరించుకోవడంతోపాటు ముత్తయిదువకు కూడా ముందురోజే రుబ్బిన గోరింటాకు ముద్దను ఇవ్వాలి.

ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి 
అంటే తెల్లవారుఝామనే నిద్రలేచి, స్నానాదులు పూర్తి చేసి, సూర్యోదయం కాకముందే చద్దిఅన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని,ఇంత నెయ్యి వేపుకుని, (ఉల్లిపాయ నంజుకుని) తినాలి. ఆ తర్వాత కమ్మటి మీగడపెరుగు వేసుకుని కడుపునిండా భుజించాలి. ఎందుకంటే, తిరిగి చంద్రోదయం అయ్యేవరకూ ఏమీ తినకూడదు. మంచినీళ్లు కూడా తాగకూడదు. ఉదయమంతా అలా ఉపవాసం ఉండి, సాయంకాలం అయ్యేవరకూ ఆటపాటలతో, ఊయలలు ఊగుతూ కాలక్షేపం చేయాలి. దీనినే ‘ఢోలోత్సవం’ అంటారు. ఈ డోలోత్సవం అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత చంద్రదర్శనం చేసుకుని, ఫోడశోపచారాలతో ఉమాదేవిని పూజించి, తోరమును కట్టుకుని, పది అట్లు నివేదన చేసి, పది అట్లు,ఒక తోరమును ఒక ముత్తయిదువుకు

అట్లతద్ది నోము ప్రాముఖ్యత

గౌరీదేవి (పార్వతీదేవి) శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు పార్వతీదేవికి సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.

అట్లతద్ది నోము లో చంద్రారాధన ప్రధానం

అట్లతద్దె నోము స్రీలు సౌభాగ్యము కోసం చేస్తారు. ఈ నోములో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం.

అట్లు నైవేద్యం చేయడంలో అంతరార్ధం ఏమిటి?

అట్లతద్ది నోములో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకి అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కుజుడు. కనుక మహిళలకు ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినపపిండి బియ్యపు పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ రెండింటితో కలిపి తయారుచేసిన అట్లనే వాయనముగా ఇవ్వాలి. దీనివల్ల గర్భస్రావము కలుగకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు.

అట్లతద్ది నోము ఎలా చేయాలి?
అట్లతద్ది నోమును ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు. అంతేకాకుండా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వారు నిర్వహిస్తారు. ఎవరు ఎలా చేసినా అందులోని అంతరార్ధం మాత్రం ఒకటే. అందరూ సౌభాగ్యం కోసమే ఈ నోము చేస్తారు.
అట్లతద్దె ముందు రోజే ఈ నోము కోసం సిద్ధం కావాలి. అందుకోసం ముందురోజే అభ్యంగన స్నానం చేసి సంకల్పం చేసుకోవాలి. ఆరోజున మినపపప్పు, బియ్యం నానబెట్టి రెండు గంటల పాటు నానాక మెత్తగా రుబ్బి అట్లపిండి సాయంత్రానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలి. అంతేకాక ముందురోజు ఒక ముత్తయిదువను వాయినానికి రమ్మని పిలవాలి. ముందురోజు ఆ ముత్తయిదువ ఇంటికి వెళ్లి కుంకుడుకాయలు, సున్నిపిండి, పసుపు ఇచ్చి బొట్టుపెట్టి అట్లతద్దె వాయినం తీసుకోవడానికి రమ్మని ఆమెను పిలవాలి.

అట్లతద్ది నోము చేయవలసిన విధానం
అట్లతద్ది రోజున తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకున్నాక ముందుగా చద్ది అన్నం తినాలి. ముందురోజు రాత్రే సిద్ధంచేసి ఉంచిన ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, పెరుగు వేసుకుని అన్నం తినాలి. చెట్లకు ఊయలలు కట్టి ‘‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్’’ అంటూ సరదాగా ఊగటం, మనకు ఇష్టమైన ఆటలు ఆడడం చేయాలి. అంటే తిన్న అన్నం అరిగిపోయేలా ఆటలు ఆడాలన్నమాట. అంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆటలాడుకునే రోజు అట్లతద్ది. తరువాత ఇంటికి వచ్చి సూర్యోదయం సమయానికి తలస్నానం చేసి పూజాగదిని సిద్ధం చేసుకోవాలి. తరువాత దీపాలు వెలిగించి గౌరీపార్వతులను పూజించాలి. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని మనం సిద్ధంగా ఉంచిన అట్లపిండిలో కొద్దిగా బెల్లం కలిపి మందంగా ఉండేలా అట్లను సిద్ధం చేయాలి.
పదకొండు(11) అట్లు అమ్మవారికి నైవేద్యానికి, మరో పదకొండు (11)ముత్తయిదువకు వాయినానికి సిద్ధం చేసుకోవాలి. చంద్రోదయం అయిన తరువాత గౌరీదేవిని పూజించాలి. పూజాద్రవ్యాల్లో భాగంగా వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, మూడు తోరాలు సిద్ధం చేయాలి. ఈ తోరాలను పదకొండు ముడులు వేసి తయారుచేయాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, మరొకటి నోము చేసుకునేవారికి వేరొకటి ముత్తయిదువకు.
తరువాత పసుపు ముద్దలతో గణపతిని, గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజించాలి. గణపతి పూజ అనంతరం వివిధ రకాల పుష్పాలు, పసుపు, కుంకుమలతో ఆ తద్దిగౌరీ దేవిని అర్చించాలి. 
తరువాత ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించాలి. అట్లపైన బెల్లంముక్క, నెయ్యి వేసి, దీనితోపాటు ముద్దపప్పు, వరిపిండితో తయారుచేసిన పాలలో ఉండ్రాళ్ళు కూడా నివేదించాలి.

అట్లతద్ది పూజలో భాగంగా అమ్మవారి ఎదురుగా ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో బియ్యం పోసి మన చేతులను ఎడమచేయిపై కుడిచేతిని పెట్టి రెండు చేతులతో బియ్యం తీసుకుని అత్తపోరు, మామపోరు, ఆడపడుచు పోరు, మగనిపోరు, ఇరుగుపొరుగు పోరు తనకు లేకుండా చూడాలంటూ ఆ గౌరీదేవిని ప్రార్థిస్తూ చేతులను మామూలు స్థితికి తెచ్చి బియ్యాన్ని ఆ పళ్ళెంలో తీస్తూ వదులుతూ ఉండాలి.

తరువాత మనం ముందుగా తయారు చేసి ఉంచిన తోరాలను అమ్మవారి వద్ద ఒక తమలపాకులో ఉంచి పూజించాలి. పూజ పూర్తయిన తరువాత ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించి మరొకటి తాము ధరించాలి. తోరబంధనం తరువాత అట్లతద్దె నోము కథను చదివి అక్షతలు తలపై వేసుకోవాలి. తరువాత అమ్మవారికి ఉద్వాసన చెప్పి అక్షతలు, నీళ్ళు ఒక పళ్ళెంలో వదలాలి. ఉద్వాసన అనంతరం మరునాడు గణపతితో పాటు గౌరీదేవిని దగ్గరలో ఉన్న నూతిలో కానీ, కాలువలో కానీ కలుపవచ్చు, లేదా నీటిలో కలిపి చెట్టుకు పోయవచ్చు, లేదా గుమ్మానికి అలంకరించవచ్చు లేదా ముఖానికి రాసుకోవడానికి వినియోగించవచ్చు.

వాయిన విధానం
అట్లతద్ది రోజు సాయంత్రం గౌరీ పూజ పూర్తయిన తరువాత ముత్తయిదువను అమ్మవారి ఎదురుగా ఒక ఆసనంపై కూర్చోబెట్టి ఆమెకు కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ, గంధం అలంకరించాలి. తరువాత పదకొండు అట్లు, ముద్దపప్పు, పాలలో ఉండ్రాళ్ళ తో పాటు మంగళద్రవ్యాలు, రవికలగుడ్డతో పాటు వాయినం సమర్పించాలి. వాయినం తీసుకోవడానికి వచ్చే ముత్తయిదువలు కూడా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు కానీ ఉండగలిగే వారు ఉంటే మంచిదే. వాయినం ఇచ్చేవారు ఒకరితో ఒకరు

ఇస్తినమ్మవాయినం
పుచ్చుకొంటినమ్మ వాయినం
నాచేతి వాయినం ఎవరు అందుకున్నారు
నేనమ్మా తద్ది గౌరీదేవి
కోరితిని వరం
ఇస్తినమ్మా వరం

అని పరస్పరం అనుకుంటూ వాయినం ఇచ్చి పుచ్చుకోవాలి. తరువాత ఆమె పాదాలకు నమస్కారం చేసి అక్షతలు వేయించుకోవాలి. ఇలా సాంప్రదాయం ప్రకారం ఈ నోమును పదకొండు సంవత్సరాల పాటు ఆచరించి ఆఖరు ఏడాది ఉద్యాపన చేసుకోవాలి.

అట్లతద్ది ఉద్యాపన విధానం

ఉద్యాపన కోసం అట్లతద్ది ముందురోజు పదకొండు మంది ముత్తయిదువలను వాయినం తీసుకోవడానికి రమ్మని పిలవాలి. అట్లతద్దెరోజు ఉపవాసం ఉండి 11 మంది ముత్తయిదువలను ఆసనాలపై కూర్చోబెట్టి వారికి పదకొండేసి అట్లు, బెల్లం ముక్క, ముద్దపప్పు, పాలలో ఉండ్రాళ్ళు, రవికెలగుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, నల్లపూసలు, నక్కజోళ్ళు, వాయినంతోపాటు ముత్తయిదువలకు అందరికీ అందించి వారిచే అక్షతలు వేయించుకోవాలి. ఈ అట్లను పలుచగా కాకుండా మందంగా వేయాలి. ఈ ఉద్యాపనతో అట్లతద్దె నోము పూర్తయినట్లు అవుతుంది.
పూజ అనంతరం చంద్రుని దర్శనం చేసుకుని మనం అమ్మవారికి నివేదించిన అట్లనే భుజించాలి. ఈ అట్లను నోము చేసుకున్న వారు మాత్రమే తినాలి.
 
విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయప్రవేశం చేయగల దిట్ట. అటువంటి ఒక అవతారమే ఇప్పుడు మనకు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అదే జగన్మోహినీ అవతారం. ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' ! ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. 

ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం కలదు. రాజమండ్రి కి 40 కి. మీ ల దూరంలో, కాకినాడ కు 74 కి. మీ ల దూరంలో, అమలాపురం కు 34 కి.మీ ల దూరంలో వశిష్ట, గౌతమీ అనే గోదావరి ఉప పాయల నడుమ ర్యాలీ గ్రామము కలదు. 


విష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తినట్లు శ్రీమహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహినీ అవతారం ఎత్తిన ప్రదేశం ర్యాలీ.  ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఎదురెదురుగా ఉండటం. సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం, తూర్పు గోదావరి ..అమృతం ర్యాలీ స్థలపురాణం గురించి శ్రీ భాగవత ఇతిహాసంలో పేర్కొనబడింది. అదేమిటంటే క్షీరసాగరమధనం సమయంలో దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే.,అమృతం పుట్టింది. 
ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపందాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై..కనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ.., అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.
అమృతం ఉద్భవించినపుడు దేవదానవులు పోట్లాడుచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తి అమృతం అందిస్తాడు. 

అయ్యప్ప జననం జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం రాలి కింద పడుతుంది. ఆ పుష్పం పడిన ప్రాంతం ఇప్పటి ర్యాలీ (ర్యాలీ అంటే పడటం అని అర్థం) అని చెబుతారు. 
చోళరాజు క్రీ.శ. 11 వ శతాబ్దంలో అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేటకై వచ్చి అలసి పోయి ఒక చెట్టుకింద సేద తీరుతాడు. ఆయనకు మహా విష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశం వద్ద తనకు గుడి కట్టించాలని చెబుతాడు. 
విగ్రహం వెంటనే రాజు కలలో నుంచి తేరుకొని ఆ ప్రదేశాన్ని వెతికి తవ్వించగా అక్కడ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడుతుంది. రాజు వెనువెంటనే అక్కడ దేవాలయ నిర్మాణం కావించాడు. గుడి ప్రాకారాలు 1936 లో పునః నిర్మించారు. 
జగన్మోహనుని రూపం అమృతం పంచిన తర్వాత మోహినిని శివుడు మోపిస్తాడు. అతని నుండి తప్పించుకునేందుకు మోహిని రథం ఎక్కి వేగంతో వెళ్ళిందట. అలా వేగంగా వెళుతున్నప్పుడు రథం శీల రాలి పడిపోతుందట. అక్కడే విష్ణువు జగన్మోహనునిగా ఉండిపోయాడట.
ప్రత్యేకత శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం శ్రీమహా విష్ణువు ప్రత్యక్ష రూపం. ఈ విగ్రహం ఏకసాలిగ్రామ శిలతో తయారైంది. ముందువైపు విష్ణువు, వెనకవైపు జగన్మోహిని రూపం కలిగి ఉండటం విగ్రహం ప్రత్యేకత. 
విగ్రహ లక్షణాలు స్వామి పాదపద్మాల మధ్య చిన్న గంగా దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. విగ్రహం ముందువైపు విష్ణువు శంఖం, చక్రం, గద మరియు అభయహస్తం కలిగి ఉండి, విగ్రహం పై భాగాన ఆదిశేషుడు పడగవిప్పి నీడనిస్తున్నట్లు ఉండటం విశేషం. 
పద్మిని జాతి స్త్రీ లక్షణాలు విగ్రహం వెనుక భాగంలో రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి వంటివి కలిగి ఉండి పద్మిని జాతి స్త్రీ లక్షణాలు కలిగి ఉంటుంది. స్వామివారికి జరిగే అన్ని పూజలు, హారతులు విగ్రహం వెనుకల కూడా జరుగుతాయి.
పరమేశ్వరుడు శ్రీ జగన్మోహిని కేశవ స్వామి తూర్పు వైపున ఉండగా ఆయనకు ఎదురూగా పరమేశ్వరుడు పశ్చిమ ముఖం తిరిగి ఉంటాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలంచే పావనం చేయబడినందున పరమేశ్వరుడిని శ్రీ ఉమా కండలేశ్వర స్వామి అని పిలుస్తారు. 
దేవాలయ ప్రాంగణంలో ఇతర విగ్రహాలు శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబర, రంభ, ఊర్వశి, శ్రీకృష, ఆదిశేషుడు, గంగా, గరుడ విగ్రహాల శిల్పకళాచాతుర్యం ఉట్టిపడుతుంది. 
పండుగలు జగన్మోహిని కేశవ కళ్యాణం, శ్రీ రామ సత్యనారాయణ పరిణయం, వేణుగోపాలస్వామి కళ్యాణం, జన్మాష్టమి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు. 
దేవాలయ టైమింగ్స్ ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని తెరుస్తారు.
మీ ప్రయాణంలో ఇవి కూడా చేర్చుకోండి వడపల్లి - శ్రీవెంకటేశ్వర ఆలయం పంచారామ ఆలయాలు - సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం
వసతి రావులపాలెం వసతికి మరియు భోజన సదుపాయాలకు సూచించదగినది. రావులపాలెం - ర్యాలీ మధ్య దూరం కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. 
ఇలా చేరండి ర్యాలీ చేరుకోవటానికి ఎటువంటి టూర్ ప్యాకేజీలు లేవు. కనుక యాత్రికులు రాజమండ్రి విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ లో దిగి ప్రవేట్ బస్సులలో లేదా టాక్సీ లలో ఎక్కి ర్యాలీ చేరుకోవచ్చు.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu



Keyworlds:
Ryali temple,Ryali,East Godavari,Atreyapuram,Ryali Ayyappa Swamy Temple,Sri Jaganmohini Kesava Swamy Temple  ryali,reli,ryeli,ryali temple History in telugu,Ryali In telugu,Lord Vishnu Temples.Lord Shiva Temples,Ayyappa swamy,Sri Jaganmohini Kesava Swamy Temple in telugu,SRI JAGANMOHINI KESAVA & GOPALA SWAMY TEMPLE,Ryali Jagan Mohini Temple History. Temple Timings, address,contact number, website, festivals, Darshan Timings,Route information.Jagan Mohini Keshava swamy temples,A.P,Andrapradesh,Hindu temples,Sabharimala,,ayyappa swamy puja vidhanam In Telugu, ayyappa swamy pooja Procedure In Telugu, Ayyappa Swamy Deeksha Niyamalu,ayyappa swamy pooja Process In Telugu,Ayyappa Swamy Hd Images,
Ayyappa Mala Rules,Ayyappa mala rules in telugu,Ayyappa Swamy Deeksha Niyamalu in Telugu,Ayyappa Swamy Nitya Pooja Niyamalu,ayyappa swamy pooja vidhanam,ayyappa swamy pooja vidhanam In Telugu,ayyappa swamy padi pooja,ayyappa swamy padi pooja Vidhanam in Telugu,ayyappa swamy pooja vidhi in Telugu,ayyappa swamy puja vidhi in Telugu,అయ్యప్పస్వామి దీక్ష నియమాలు,Ayyappa Swamy Mala deeksha niyamalu In telugu,Pooja Niyamalu,Ayyappa Swamy  History In Telugu,Ayyappa Swamy Story In Telugu,ayyappa ashtothram,ayyappa ashtottara shatanamavali in telugu,ayyappa namalu in telugu,ayyappa sahasranamavali,1008 names of ayyappa in Telugu,ayyappa swamy 108 names in Telugu,ayyappa Swamy 108 namalu in telugu, ayyappa sahasranamam, ayyappa Songs,Ayyappa Swamy MP3 Songs,Ayyappa Swamy Latest Songs
,Ayyappa Swamy Birth History

Comments