దసరా వైభవం మరియు దశర పండుగ యొక్క ప్రాముఖ్యత
దసరా అంటే దన్ + హరా అని; అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు.
అందువల్ల దీనిని "దసరా వైభవం"గా దశమినాడు జరుపుతూ ఉంటారు. ఇక దేవినవరాత్ర పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్జిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రులు శరన్నవరాత్రులని పిలుసూ శుద్దపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేసారు.
ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ పంచమా స్కందమాతేతి షష్ణాకాత్యాయనేతి చ సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా, మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే! అలంకారాలు వేరైనా అమ్మ దయ అందిరపట్ల ఒక్కటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి.
ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవార్కి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేసూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త దశమి తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు 'దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.
ఈ దేవి శరన్నవరాత్రత్సవాలు జరపడంల్లోకూడా మంచి అంతరార్థం ఉన్నదట! శరదృతువుకు వర్షరుతువు ఉంటుంది. బహుళంగా కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి "యమదంష్ట్రము"లని పేరు. దేవి మహిషాదిజంతువులను జయించడంల్లో అంతరార్థమిదే అని దేవీభాగవతం చెపోంది.
ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు ఋతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని శాస్త్రము. ఈ సందర్భంగా ఒక్కసారి ఆ దేవీ ఆవిర్భావ విశేషంగూర్చి కొద్దిగా సమీక్షిస్తే .పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభు లతో పదివేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేక పోతాడు.
ఆ పరిస్థితిని గమనిస్తున్న మహామాయ ఆ మధుకైటభులను మోహపూరితుల్ని చేస్తుంది. దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందులకు శ్రీ మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా ఈయమని కోరుకుంటాడు. దానితోవారు తమకు ఇకమరణము తప్పదని నిర్ణయించు కుని తమను నీరులేనిచోట చంపమనికోరతారు. అంత శ్రీహరి వారిని పైకెత్తి భూఅంతరాళంలో సంహరించు సమయాన; మహామాయ పదితలలతో, పదికాళ్ళతో, నల్లనిరూపతో "మహకాళి" గా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువునకు సహాయపడుతుంది. అనంతరం 'సింహవాహినిగా మహిషాసురుని మహామాయ మహాసరస్వతి రూపిణిగా శుంభ, నిశుంభులను వధించింది.
చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది.
తరువాత ఐదవ అవతారంలో ఒక రాక్షసంహారసమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడంవల్ల "రక్తదంతి" అయినది. లోకాలు అన్ని కరువు కాటకములతో ప్రజలు పడుతున్న బాధలను చూడలేక "శాకంబరి"గా వార్కి శాకాలు, ఫలాలను ఇచ్చి ఆ తల్లి బిడ్డలను అక్కున చేర్చుకుంది. దురుడను అను రాక్షసుని సంహరించి 'దుర్గ"అను పేరుగాంచింది. "మాతంగి" గా రూపుదాల్చి అంటరానితనాన్ని తొమ్మిదవ అవతారంలో అరుణుడు అను రాక్షసుని తుమ్మెదల సాయంతో హతమార్చి "బ్రామరి" అను పేరు తెచ్చుకుంది. అందువల్ల ఈ దేవిని "నవవిధ రూపాలతో" అర్చించాలి అని చెప్పబడినది. ఆ విధంగా: క్రూరులైన రాక్షసులను సంహరించి ఇటు యోగులకు అటుదేవతలకు ఆనందాన్ని అందించింది సందర్భములో
ఈ దేవి నవదుర్గలుగా అవతరించింది అనగా
4. కూష్మాండా
6. కాత్యాయని
7. కాళరాత్రి
8. మహాగౌరీ
9. సిద్ధిదాత్రి అనుపేర్లతో ఆవిర్భవించినది. ఈ నవదుర్గలను దేవతలు, భక్తులు స్తోత్రము చేసినారు. ఈ పరాశక్తి ప్రకృతి. ఈమె సనాతన పురుషునితో కలసి విశ్వసృష్టి చేస్తుంది. ఈమె సకలదేవతా స్వరూపిణి, సృష్టికారిణి. అందుచేతనే ఈమె మహామాయ. జగదుత్పత్తి స్థితిలయకారిణి. శత్రుభయకారిణి ముక్తిదాయని అయినది.
దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకు నిదర్శనంగా ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం సంప్రదాయం. అమ్మవారి వివిధ రూపాలు...
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దశమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదశమి
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
The Significance of Devi Navaratri,dasara festivals in telugu,dasara,దసరా,Vijayadasami,dasara festival story,dasaraImages,dasara Quotes,Dasara navaratri in telugu,Dasara Navaratri Astotharams ,dasara significance in telugu,dasara significance in telugu ,9 Different Avatars of Goddess Durga,దసరా వైభవం,Devi Navaratri Pooja Vidhi,Pooja Vidhanam,విజయదశమి,dasara festivals in telugu,vijayadashami pooja vidhi in telugu,Dasara Puja, Durga Puja Vidhanamu,Vivaramulu in Telugu,Navaratri Pooja Vidhanam , Vijaya Dasami (Dasara) Puja,పూజావిధి (Navaratrulu Poojavidhi),durga devi pooja vidhanam telugu pdf,dasara puja vidhi in telugu,durga devi nitya pooja vidhanam in telugu,devi navratri pooja vidhanam,Dasara pooja vidhanam,devi navratri pooja vidhanam in telugu, 9 days devi navratri pooja vidhanam, 9 days devi navratri pooja vidhanam in telugu, Vijaya Dasami (Dasara) Puja,పూజావిధి (Navaratrulu Poojavidhi),durga devi pooja vidhanam telugu pdf,dasara puja vidhi in telugu,durga devi nitya pooja vidhanam in telugu,అమ్మవారి నవరాత్ర పూజా విధి: పూజకు ఉపయోగించాల్సిన సామాగ్రి,Dasara Puja, Durga Puja Vidhanamu, Vivaramulu,Telugu,శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం ,devi navaratri pooja vidhanam in telugu,durga devi nitya pooja vidhanam in telugu pdf,Navratri Puja Procedure.durga devi pooja vidhanam in telugu pdf,navaratri pooja vidhanam telugu pdf,devi navratri pooja vidhanam,Dasara pooja vidhanam,devi navratri pooja vidhanam in telugu, 9 days devi navratri pooja vidhanam, 9 days devi navratri pooja vidhanam in telugu,Durga Matha Pooja Vidhanam ,
Navaratri Pooja Vidhanam,dasara festival story,dasara significance in telugu,dasara festivals in telugu,vijayadashami pooja vidhi in telugu,Navaratrulu Pooja vidhi,9 days devi navratri pooja vidhanam,Durga Matha Pooja Vidhanam,How To Do Navaratri Pooja (Telugu),Timings Of Pooja And Its Timings,Pooja Niyamalu,Mistakes In Pooja,Pooja,Don't Do This Mistakes At Pooja Time,What is the Right Time to Do Puja at home?,Durga Devi Pooja Vidhanam,kumari Pooja,Devi Navaratri Pooja Vidhanam In Telugu,Devi Navaratri First day Pooja Vidhi,Navaratri day 2 Brahmacharini Pooja Vidhanam,Vijayadasami puja vidhanam
Devi Navaratri Pooja Vidhanam at Home in Telugu, Vijayadasami Pooja Procedure In Telugu Dasara




Comments
Post a Comment