దశర పండుగ యొక్క ప్రాముఖ్యత
దసరా నవరాత్రులు... నవ వర్ణాలు!
దసరా నవరాత్రులు... నవ వర్ణాలు!
దుర్గా నవరాత్రుల్లో భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి.
నవ రాత్రి పదం లో "నవ" శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని ని పూజించడం ప్రశస్తం గా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు'.
నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం, అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది.
నవ రాత్రులో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకం లో అపమృత్యు దోషం ఉన్న వారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.
సరస్వతి పూజ - నవ రాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతి దేవిని పూజించాలి. అమ్మ వారికి నైవేద్యం గా తెల్లని కుడుములు సమర్పించాలి. విద్య రూపం లో జ్ఞానం ప్రసాదించే సరస్వతి దేవి అనుగ్రహం కొరకు, లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించడం కొరకు. సరస్వతి దేవి ని పూజించడం వలన ప్రాప్తిస్తాయి. సదా ఆమె కృపాకటాక్షాల వలన జ్ఞానం కలిగి అన్నింటా విజయం లబిస్తుంది.
దుర్గాష్టమి - కాల చక్రం లో ఆశ్వయుజ మాసం లో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితి లో ఉండటం వల్ల ఆరోగ్య ప్రాణ హాని కలిగించే అనేక దుష్టశక్తులు విజ్రుమ్బిస్తుంటాయి. శరత్ వసంత అనే ఇద్దరు రాక్షసులు వివిధ రోగాలకు కారకులు. ఈ ఋతు పరివర్తన సమయం లో జ్వరాలు, విషజ్వరాలు, కఫం దగ్గు మొదలైన ఉపద్రవాలను నివారించటానికి అనాదిగా దుర్గా పూజా విధానం ఆచరణలో ఉంది దేవి మహా గౌరిగా దర్శనమిచ్చే రోజు. ఈ అష్టమికే మరో పేరు కాలికాష్టమి దుర్గా అష్టోత్తరం, సహస్ర నామాలు చదువుతూ అమ్మవారి ని పూజించాలి. దేవికి దానిమ్మ పండ్లు, పొంగలి ,పులోహోర నివేదన చెయాలి. కుజ గ్రహ దోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించడం చక్కటి పరిహారం గా చెప్పవచ్చు.
మహర్నవమి - నవరాత్రులలో ప్రధానమైన రోజు దేవి మహిషుడిని సంహరించిన రోజు. మహిషాసుర మర్దిని రూపం లో మహా శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎరుపురంగు పూలు, జమ్మి పూలు, కనకాంబరాల తో పూజించి పొంగలి,పులిహోర, అరటి పండ్లు నివేదించడం మంచిది.
విజయ దశమి - ఆశ్వయుజమాసం శుక్లపక్షం లో వచ్చే దశమి తిథి రోజున, సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయ కాలం. సమస్తమైన కోరికలను తీర్చే ఆ కాలం పేరు మీదుగానే దశమి కి 'విజయదశమి' అని పేరు వచ్చింది. సాధారణం గా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది.
నక్షత్ర మండలం లో శ్రవణ నక్షత్రం చెవి ఆకారం లో ఉంటుంది అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంబిస్తే విశేషం గా లాభిస్తుంది. శమీచెట్టు యొక్క పూజ ఈరోజు విశేషం గా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది.
విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలం లో, ధన స్థానం లో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గా దేవికి, సిద్ది ప్రదాత వినాకునికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది.
పూర్వంజమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశం లోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షం లో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది.
ఈ రోజే శ్రీ రాముడు రావణుని పై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీ రాముని వనవాస సమయం లో కుటీరం జమ్మి చెట్టు చేక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసం కి వెళ్ళే ముందు తమ అయుదాల్ని శమీ చెట్టు పై పెట్టడం జరిగింది.
దసరా నవరాత్రుల్లో... దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం...
మొదటి రోజు: నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు శైలపుత్రిగా మనం దుర్గమ్మను ఆరాధిస్తాం. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.
రెండో రోజు : బ్రహ్మచారిణిగా శక్తిని కొలుస్తాం. కనుక ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి.
మూడో రోజు: అమ్మవారి అవతారం ఈ రోజు చంద్రఘంట. బూడిద రంగు దుస్తులు ధరించాలి.
నాలుగో రోజు : దుర్గమ్మను కూష్మాండ అవతారంగా కొలుస్తాం. నారింజ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది.
అయిదో రోజు: స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించి పూజచేయాలి.
ఆరో రోజు: కాత్యాయనీ మాతగా అమ్మవారు కొలువుదీరే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
ఏడో రోజు: కాళరాత్రి అవతారంతో అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుంది. ఈ రోజున నీలం రంగు దుస్తులు వేసుకోవాలి.
ఎనిమిదో రోజు: మహాగౌరీ మాతగా దుర్గమ్మని గులాబీ రంగు వస్త్రాల్లో కొలవాలి.
తొమ్మిదో రోజు: చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందు కుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
The Significance of Devi Navaratri,dasara festivals in telugu,dasara,దసరా,Vijayadasami,dasara festival story,dasaraImages,dasara Quotes,Dasara navaratri in telugu, Dasara Navaratri Astotharams ,dasara significance in telugu,dasara significance in telugu ,9 Different Avatars of Goddess Durga,దసరా వైభవం,devi navratri pooja vidhanam,Dasara pooja vidhanam,devi navratri pooja vidhanam in telugu, 9 days devi navratri pooja vidhanam, 9 days devi navratri pooja vidhanam in telugu, Dasara ,Navaratri Pooja Vidhanam, Devi Navaratri 1st Pooja Vidhanam,Navaratri Pooja Vidhanam In Navaratri Pooj,The Significance of Devi Navaratri,dasara festivals in telugu,dasara,దసరా,Vijayadasami,dasara festival story,dasaraImages,dasara Quotes,Dasara navaratri in telugu,Dasara Navaratri Astotharams ,dasara significance in telugu,dasara significance in telugu ,9 Different Avatars of Goddess Durga,దసరా వైభవం,Devi Navaratri Pooja Vidhi,Pooja
Navaratri Pooja Vidhanam,dasara festival story,dasara significance in telugu,dasara festivals in telugu,vijayadashami pooja vidhi in telugu,Navaratrulu Pooja vidhi,9 days devi navratri pooja vidhanam,Durga Matha Pooja Vidhanam,How To Do Navaratri Pooja (Telugu),Timings Of Pooja And Its Timings,Pooja Niyamalu,Mistakes In Pooja,Pooja,Don't Do This Mistakes At Pooja Time,What is the Right Time to Do Puja at home?,Durga Devi Pooja Vidhanam,kumari Pooja,Devi Navaratri Pooja Vidhanam In Telugu,Devi Navaratri First day Pooja Vidhi,Navaratri day 2 Brahmacharini Pooja Vidhanam,Vijayadasami puja vidhanam
Devi Navaratri Pooja Vidhanam at Home in Telugu, Vijayadasami Pooja Procedure In Telugu Dasara






Comments
Post a Comment