ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని కస్యప మహర్షి కట్టించాడని పద్మ పురాణం వెల్లడిస్తే, సాక్షాత్తు ఇంద్రుడే దీనిని నిర్మించాడని కొందరంటారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిస్కృతమైంది. ఆలయంలోని మూలవిరాట్టును సోమవారం ఉదయం సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి.
మూడేళ్ల తర్వాత సూర్యకిరణాలు ఏడు నిమిషాల పాటు స్వామివారిని తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి గత మూడేళ్లుగా మేఘాలుఅడ్డుపడటంతో భక్తులు ఒకింత నిరాశకు గురయ్యారు. క్షణాల వ్యవధిలోనే ముబ్బులు తొలగి స్వామివారి ముఖాన్ని కిరణాలు తాకడంతో భక్తులు తన్మయత్వం చెందారు. ఈరోజు ఉదయం 6 గంటల 6 నిమిషాల సమయంలో స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు బంగారం ఛాయ లేలేత కిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టం తో భక్తులు ఆనందోత్సాహాలతో పరవశించారు.
ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ భాస్కరుడిని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. సూర్యకిరణాలు ఆలయంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తులు విశ్వసిస్తుంటారు. మన దేశంలోని సూర్యదేవాలయాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది.
పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయం నిర్మించాడని, దీని పక్కనే ఉన్న కోనేరును ఇంద్ర పుష్కరిణి అని అంటారు.
ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మార్చి నెల 9, 10, అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాటును తాకుతాయి. మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ అద్భత దృశ్యాన్ని తిలకించి పరవశించిపోయారు.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Key words:
Arasavalli,Suryanarayana Swamy Temple Arasavalli ,Srikakulam,Andhra Pradesh,Sun rays,arasavalli,శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి,Arasavalli Temple History,arasavalli temple,arasavalli temple sun rays,arasavalli temple accommodation,arasavalli suryanarayana temple,srimukhalingam temple history in telugu,srikurmam temple history in telugu,arasavalli temple address,




Comments
Post a Comment