వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)
గణపతిలోని రూపాలు మహాగణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అను 6 రకాల గణపతులను ఆయా ప్రాంతాలలో ఆరాధిస్తారు.
వినాయక చవితి: విశిష్టత,పూజ జరుపుకునే విధానం
పండుగలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఇక భాద్రపద శుద్ధ చవితి రోజని విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకలదేవతలకు ఆయనే ప్రభువన్న మాట. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్తన పురాణంలో గణ శబ్ధానికి విజ్ఞానమని, ణ అంటే తేజస్సు అని పేర్కొన్నారు. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన ఘంటకుడిగా వినాయకుడిని నియమించాడు. గణనాథుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారట.
శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము.
శ్రీ వరసిద్ధి వినాయకవ్రతమునకు కావలసిన వస్తువులు:
పసుపు 25 గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి
పార్ఠివగణపతి(మట్టితో చేసిన గణపతి)
పాలవెల్లి(అలంకారముతొ)
బియ్యం 1/2అరకిలొ
తమలపాకులు 20
అగరవత్తులు 1 ప్యాకట్
ప్రత్తి(ఒత్తులకు,వస్త్రయుగ్మమునకు,యజ్ణోపవీతమునకు)
దీపము(ఆవునేతితొగాని, కొబ్బరి నూనెతొగాని)
పంచామృతములు(ఆవుపాలు, పెరుగు,నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపళ్ళు, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ ,హారతి కర్పూరం
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. 1. మాచీ పత్రం/మాచ పత్రి 2. దూర్వా పత్రం/గరిక 3. అపామార్గ పత్రం/ఉత్తరేణి 4. బృహతీ పత్రం/ములక 5. దత్తూర పత్రం/ఉమ్మెత్త 6. తులసీ పత్రం/తులసి 7. బిల్వ పత్రం/మారేడు 8. బదరీ పత్రం/రేగు 9. చూత పత్రం/మామిడి 10. కరవీర పత్రం/గన్నేరు 11. మరువక పత్రం/ధవనం, మరువం 12. శమీ పత్రం/జమ్మి 13. విష్ణుక్రాంత పత్రం/ 14. సింధువార పత్రం/వావిలి 15. అశ్వత్థ పత్రం/రావి 16. దాడిమీ పత్రం/దానిమ్మ 17. జాజి పత్రం/జాజిమల్లి 18. అర్జున పత్రం/మద్ది 19.దేవదారు పత్రం 20. గండలీ పత్రం/లతాదూర్వా 21. అర్క పత్రం/జిల్లేడు.
పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము:
వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా? ఏ రంగుది వాడవలెను? ఇవి అనేకుల ప్రశ్నలు. దీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు.
శ్లో: పార్థివీ పూజితామూర్తి:స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి
పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్ర, పశ్వాది సమస్త సంపదలను పొందగలరు.
“మృత్తికాం సుందరాం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితాం“
శుభ్రం అయినది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చం అయిన నీటితో తడిపి ప్రతిమచేయవలెను
శ్లో. కృత్వా చారుతరాం మూర్తిం గ ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజ విరాజితాం
నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యం కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారు. అట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను.
దూర్వాయుగ్మ పూజ:
వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వలు అనగా గరిక పోచలు. గరిక అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరికపోచలు వినాయకుని పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ అయినవి. గణేశుడే స్వయంగా “మత్పూజా భక్తినిర్మితా మహతీ స్వల్పికావాపి వృధా దూర్వ్వంకురై ర్వినా“ అంటే నాకు భక్తితో చేసినపూజ గొప్పది అయినను, చిన్నది అయినను దూర్వాంకురములు లేకుండా చేసినచో అది వృధా కాగలదు.
“వినా దూర్వాంకు రై: పూజా ఫలంకేనాపి నాప్యతే
తస్మాదుషసి మద్భ త్కై రేకా వాప్యేక వింశతి:
భక్త్యా సమర్పితా దూర్వా దదాతి యత్ఫలం మహత్
నతత్క్ర్ తుశతై ర్దా నైర్వ తానుష్టాన సంచయై :“
దూర్వాంకురములు లేని పూజ వలన ఫలమేమియు కలుగదు. అందుచే నాకు భక్తులగువారు ఉష:కాలమందు ఒకటి గాని, ఇరువది ఒకటి గాని దూర్వలచే పూజింవచినచో కలుగు ఫలితము వంద యజ్ఞములవలన గాని, దానముల వలన గాని, వ్రతముల వలన గాని, తపముల వలన గాని పొందుట సాధ్యము కాదు. “దూర్వాయుగ్మమం” అంటే రెండేసి గరికపోచలు సమర్పించవలెను. ఒకటి ఒకటి విడదీయరాదు. శుభములు కలిగించునది, పుణ్యమును చేకూర్ఛునది అయిన కార్యములు చేయునపుడు ఆటకములు లేకుండ ఆ కార్యము జరుగుటకు గణాధిపతిని ముందుగ పూజించవలెను.
వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపళ్ళెములో బియ్యం పోసి ఆ బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెను. ఆకు కొన తూర్పునకు ఉండవలెను. ఆవు నేతితో గాని, నూనెతో గాని దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.
శ్రీ మహాగణాధిపతయే నమ: శ్రీ గురుభ్యోనమ: హరి: ఓం
శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
మం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి సామోమంద్రేషమూర్జంయహానా ధేనుర్వాగస్మానం పసుష్టుతైతు అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు.
ఆచమనం:
పాత్ర(అనగా చిన్న చెంబు లేక గ్లాసు) తో నీరు తీసుకొని ఉద్ధరిణి లేదా చెంచాతో ఆచమనం చేయవలెను. బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణుపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటంత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.
ఓం కేశవాయ స్వాహా:
ఓం నారాయణాయ స్వాహా:
ఓం మాధవాయ స్వాహా :
(ఈ మూడు నామములు చెప్పుచూ కుడి చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను.)
ఓం గోవిందాయ నమ: (చేతిని కడుగ వలెను.)
ఓం విష్ణవే నమ: ఓం త్రివిక్రమాయ నమ: ఓం వామనాయ నమ: ఓం శ్రీధరాయ నమ: ఓం హ్రుషీకేశవాయ నమ: ఓం పద్మనాభాయ నమ: ఓం దామోదరాయ నమ:
ఓం సంకర్షణాయ నమ: ఓం వాసుదేవయ నమ: ఓం ప్రద్యుమ్నాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ: ఓం అధోక్షోజాయ నమ: ఓం అచ్యుతాయ నమ: ఓం జనార్థనాయ నమ: ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ:
దైవ ప్రార్థన:
(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.
శ్లో: 1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థో జనార్థన:
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ: ఉమా మహేశ్వరాభ్యాం నమ: శచీ పురంధరాయ నమ: అరుంధతీ వశిష్టాభ్యాం నమ: శ్రీ సీతారామాభ్యాం నమ: సర్వేభ్యో మహాజనేభ్యో నమ:
భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే
తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.
ప్రాణాయామము: ఓం భూ: ఓం భువ: ఓం సువ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం
(గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అందురు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)
సంకల్పము:
(ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి,ఏ పని చేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అందురు.)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే,శుక్లపక్షే, చతుర్థ్యాం ………………. వాసరే,శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే.
(నీరు ముట్టుకొనవలెను.)
కలశారాధనం: (కలశం అనగా పూజ చేయుటకు నీరు తీసుకున్న పాత్ర. ఆచమనము చేయుటకు పెట్టుకున్న నీటిపాత్రను కలశారాధనకు వాడరాదు.వేరేపాత్రలో నీటిని పోసి ఆ పాత్రచుట్టూ మూడుచోట్ల గంధము, కుంకుమ, అక్షతలు అద్ది ఆనీటిలో గంధమును, పుష్పములను, అక్షతలను ఉంచితే అదే కలశము. దానిపై చేతిని ఉంచి ఈ క్రింది విధముగా చదువవలెను.
శ్లో: కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాశ్రిత: మూలే తత్ర స్థితోబ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతా:
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణ:
అంగై శ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితా: కలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్యహస్తే నాచ్చాద్య.
మం: ఆదల శేషుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్ధైర్యజ్ణేషు వర్ధతే, ఆపోవా ఇదగ్ం సర్వం విశ్వాభూతా న్యాప: ప్రాణావా ఆప: పశవ ఆపోన్నమాపోమృతమాపస్సమ్రాడాపోవిరాడాపస్స్వరాడాపశ్చందాగ్ స్యాపో జ్యోతీగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం.
గంగేచ యమునేకృష్ణె గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్ధం మమ దురితక్షయకారకా: కలశోదకేన దేవం, ఆత్మానం, పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య. (కలశములోని నీరు పుష్పముతో గణపతి పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.
గణపతి పూజ
ప్రాణ ప్రతిష్ట
(పుష్పముతో పసుపు గణపతిని తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవింకవీనాం ఉపవశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్నణస్పత ఆనశృణ్వమన్ న్నోతిభి స్సీదసాధనం
అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమినహనోదేహి భోగం
జ్యోక్పశ్యేమసూర్యముచ్చరంతమనుమతే మృళయాద స్స్వస్తి
అమృతంవై ప్రాణామృతమాప:ప్రాణానేవయధాస్థానముపహ్వ్యయతే.
శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నిపుత్ర పరివార సమేతం శ్రీమహాగణాధిపతిం ఆవాహయామిస్థాపయామి పూజయామి స్థిరో భవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు. గణపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తో అస్తు.
షోడశోపచార పూజ:
(క్రింది విధముగా ఒక్కొక్క ఉపచారము చెప్పి గణపతికి అక్షతలు సమర్పించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి,
(క్రింది విధముగ చదువుతు కలశములోని నీరు పుష్పముతో గణపతిపై చల్లవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వారత్మక: శ్రీ మహాగణాధిపతయో నమ: వస్త్రయుగ్మం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమ: యజ్ణోపవీతం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమ: అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
(ఏ క్రింది నామములు చదువుతూ గణపతికి పుష్పములు గాని, అక్షతలు గాని భక్తితో సమర్పింవవలెను.)
ఓం సుముఖాయ నమ: ఓం ఏకదంతాయ నమ: ఓం కపిలాయ నమ: ఓం గజకర్ణాయ నమ: ఓం లంబోదరాయ నమ: ఓం వికటాయ నమ: ఓం విఘ్నరాజాయ నమ: ఓం గణాధిపతయే నమ: ఓం ధూమకేతవే నమ: ఓం గణాధ్యక్షాయ నమ: ఓం పాలచంద్రాయ నమ: ఓం గజాననాయ నమ:
ఓం వక్రతుండాయ నమ: ఓం శూర్పకర్ణాయ నమ: ఓం హేరంబాయ నమ: ఓం స్కందపూర్వజాయ నమ: ఓం సర్వసిద్ధి ప్రదాయ నమ: ఓం మహాగణాధిపతయే నమ: షోడశ నామభి: పూజాం సమర్పయామి.
(అగరవత్తులు వెలిగించి ధూపమును చూపించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి.
(దీపమునకు నమస్కరించవలెను.)
దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి.
(బెల్లముపై నీరు చల్లి, చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.)
ఓం భూర్భువస్సువ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్, సత్యంత్వర్తేన పరిషించామి.
శ్రీ మహాగణాధిపతయే నమ: అవసరార్ధం గుడోపహారం నివేదయామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం
ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధముగా చదివి కలశములోని నీరు వదలవలెను.) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: తాంబూలం సమర్పయామి.
(కర్పూరం వెలిగించి గంట మ్రోగించుచూ క్రింది విధముగా చదివి హారతి యివ్వవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి
సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే తయామాసగ్ం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు, శ్రీ మహాగణాధిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ద ఆచమనీయమ్ సమర్పయామి.(పళ్ళెములో నీరు వదలి హారతి కళ్ళకు అద్దుకొనవలెను.తరువాత క్రిందివిధముగా ఉపచారములు చెబుతూ అక్షతలు సమర్పించవలెను.)
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ్ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో బవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. (పూజ చేసిన అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలెను.)
శ్లో: ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక.
ఉద్వాసన:
మం: యజ్ణేన యజ్ణ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్, తేహనాకం మహిమానస్సచంతే, యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:
శ్రీ మహాగణాధిపతిం యధాస్థానముద్వాసయామి. శోభనార్ధం పునరాగమనాయచ.
(గణపతిని తమలపాకుతో తీసి పూజామందిరంలో ఈశాన్యభాగంలో ఉంచవలెను.)
(పసుపు గణపతి పూజ సమాప్తం)
హరి: ఓం తత్సత్.
శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము
పాలవెల్లిని పండ్లు, పుష్పములు, మామిడి ఆకులు మొదలగు వాటితో అందముగా అలంకరింవి దేవుని మందిరముపై వ్రేలాడదీసి, ఆ పాలవెల్లి క్రింద కర్ర చెక్కను గాని, పీటను గాని పసుపు పూసి, కుంకుమ, వరిపిండి మొదలగువానితో అలంకరింవిఉంచుదురు. ఆపీటపై ఒక తమలపాకును కొన తూర్పువైపు ఉండునట్లు పెట్టి దానిపై వినాయకప్రతిమను ఉంచవలెను.
శ్లో: ఓం శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ:
ఆచమనం: ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా,ఓం గోవిందాయ నమ:
విష్ణో, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే, శ్రీ కృష్ణాయ నమ:
భూతోఛ్ఛాటన:
శ్లో: ఉత్తిష్టంతు భూతవిశాచా: ఏతే భూమిభారకా: ఏతేషామవిరోధేన, బ్రహ్మకర్మ సమారధే.
ప్రాణాయామము:
మం: ఓం భూ:, ఓంభువ:, ఓగ్ం సువ:, ఓం మహ:, ఓంజన: ఓంతప:, ఓగ్ం సత్యం, ఓంతత్సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యోన: ప్రచోదయాత్, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం.
సంకల్పము:
మమ ఉపాత్తదుతితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,మేరోర్దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్యప్రదేశే,
గంగా గోదావర్యోర్మధ్యదేశే, శోభనగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరే, దక్షిణాయనే, భాద్రపదమాసే, శుక్లపక్షే, చతుర్ధ్యాం ——–వాసరే,శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ ——–గోత్ర:ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య,ధైర్య,విజయ,అభయ,ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధసిద్ధ్యర్ధం,
పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం, సకల కార్వేషు సర్వదాదిగ్వజయ సిద్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ ఫలసిద్ధ్యర్ధం,వర్షే వర్షే ప్రయుక్త స్రీ వరసిద్ది వినాయక దేవతాముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయకదేవతాప్రీత్యర్ధం, సంభవద్భి: అంకై, సంభవద్భి:ఉపచారై:,సంభవతానియమేన, పురుషసూక్త విధానేన, కల్పోక్తప్రకారేణ, ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను.)
వరసిద్ధి వినాయక ప్రతిమాశోధనం కరిష్యే:
(వినాయక ప్రతిమను పంచామృతములచే శుద్ధి చేయవలెను. పంచామృతములు అంటే ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన నీరు. వీనిలో ఒక్కొక్క ద్రవ్యముతో ప్రతిమను శుద్ధి చేయుచూ చదువ వలసిన మంత్రములు ఇవ్వబడినవి. మంత్రము చదువుచు కొంచెము కొంచెముగా పంచామృతములు పుష్పముతో ప్రతిమపై చల్లవలెను. పంచామృతములు లభింపనిచో కొబ్బరినీటితో ప్రతిమా శోధనం చేయవచ్చును.)
పాలు: మం: ఆప్యాయస్వసమేతుతే, విశ్వత స్సోమవృష్ణియం, భవా వాజస్య సంగధే
పెరుగు: మం: దధిక్రావ్ణ్ణోఅకారిషం, జిష్ణోరశ్వస్యవాజిన:, సురభినోముఖాకరత్, ప్రణ ఆయుగ్ంషితారిషత్
నెయ్యి: మం: శుక్రమసి జ్యోతిరసి తేజోపిదేవోవస్సవితోత్పునాత్వచ్ఛిధ్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:,
తేనె: మం: మధు వతఋతాయతే, మధుక్షరంతి సింధవ: మాధ్వీర్నస్సంత్వోషధీ:, మధుసక్తముతో షసి, మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్య:, మాధ్వీర్గావో భవంతున:
పంచదార: మం: స్వాదు: పవస్వ దివ్యాయ జన్మనే, స్వాదురింద్రాయసుహ వేతునామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే, బృహస్పతయే మధుమాగ్ం అదాభ్య:
ఉదకము: మం: ఆపోహిష్టామయోభువ: తానఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే, యోవశ్శివతమోరస: తస్యభాజయతే హన:, ఉశతీరివ మాతర:, తస్మా అరంగ మామవ: యస్యక్షయాయ జిన్వధ, ఆపోజనయధాచన:
ప్రాణప్రతిష్ట: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.)
మం: తత్పురుషాయ విద్మ్హహే మహాదేవాయ ధీమహి, తన్నో దంతి: ప్రచోదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక మావాహయామి స్థాపయామి పూజయామి
(పుష్పములు , అక్షతలు వినాయకునిపై ఉంచవలెను. తరువాత పుష్పమతో వినాయకువి తాకుతూ ఈ క్రింది విధముగాచదివి, ఆ పుష్పమును వినాయకుని వద్ద ఉంచవలెను.)
మం: అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమిహనోధేహి భోగం, జ్యోక్పశ్యేమ సూర్య మచ్చరంత, మనుమతేమృడయాన స్స్వస్తి, అమృతం వై ప్రాణా:, అమృతమాప: ప్రాణానేవ ధాస్థానముపహ్వయతే. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు.
ధ్యానం: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ క్రింది విధముగా చదివి వినాయకునిపై ఉంచవలెను.)
శ్లో: 1. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం, విఘ్నరాజ మహం భజే.
ఏకదంతం శూర్పకర్ణం, గజవక్త్రం చతుర్భుజం – పాశాంకుశధరం దేవం, ద్యాయేత్సిద్ధి వినాయకం.
ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం – భక్తాభీష్టప్రదంతస్మాత్, ధ్యాయేత్తం విఘ్ననాయకం.
ధ్యాయేద్గజాననం దేవం, తప్తకాంచన సన్నిభం – చతుర్భుజం మహాకాయం, సర్వాభరణ భూషితం.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం: మం: సహస్రశీర్షా పురుష:, సహస్రాక్ష స్సహస్రపాత్,సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్టద్దశాంగులం.
శ్లో: అత్రాగఛ్ఛ జగద్వంద్య, సుర రాజార్చితేశ్వర, అనాధ నాధసర్వజ్ఞ, గౌరీ గర్భ సముద్భవ.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆవాహయామి.
రత్నసింహాసనం: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదివి వినాయకునికి సమర్పింవవలెను.)
మం: పురుష ఏ వేదగ్ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, ఉతామృతత్వ శ్యేశాన: యదన్నే నాతి రోహతి
శ్లో: మౌక్తికై: పుష్యరాగైశ్చ, నానారత్న విరాజితం రత్నసింహసనం చారు, ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: రత్నసింహాసనం సమర్పయామి.
పాద్యం:
మం: ఏతావానశ్యమహిమా, అతోజ్యాయాగ్ శ్చపూరుష: పాదోస్యవిశ్వాభూతాని, త్రిపాదస్యామృతం దివి.
శ్లో: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక, భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: పాదయో పాద్యం సమర్పయామి. (పుష్పముతో వినాయకుని పాదములపై నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:
మం: త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష:,పాదోస్యేహాభవాత్పున: తదోవిష్వజగ్వ్యక్రామత్, సాశనానశనే అభి
శ్లో: గౌరీపుత్ర నమస్తేస్తు, శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం, గధపుష్పాక్ష తైర్యుతం
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి. (నీరు విడువవలెను.)
ఆచమనీయం:
మం: తస్మా ద్విరాడజాయత, విరాజో అధిపూరుష: సజాతో అత్యరివ్యత, పశ్చాద్భూమి మధోపుర:
శ్లో: అనాధ నాధ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత, గృహాణాచమనందేవ, తుభ్యం దత్తంమయాప్రభో
శ్లో: శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమ: ముఖే ఆచమనీయం సమర్పయామి. ( వినాయకునిపై పుష్పముతో నీరు చల్లవలెను.)
పంచామృత స్నానం:
(క్రింది విధముగా చదువుచూ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీరు పుష్పముతో వినాయకునిపై చల్లవలెను):
మం: యత్పురుషేణ హవిషా, దేవాయజ్ఞ మతన్వత
వసన్తో అస్యాసి దాజ్యం, గ్రీష్మ ఇధ్శశ్శ్రరద్ధివి:
శ్లో: 1. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గ్రహణేదం గజవక్ర్త నమోస్తుతే
స్నానం పంచామృతైర్ధేవ గృహణ గణనాయక
పయోదధి ఘృతైర్యుక్తం శర్కరామధు సంయుతం
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
పంచామృత స్నానం సమర్పయామి.
శుద్దోదక స్నానం:
శ్లో: గంగాది సర్వతీర్ధేభ్య: అమృతైరమలైర్జలై:
స్నానం కురిష్య భగవాన్నమ పుత్ర నమోస్తుతే :
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
శుద్దోదక స్నానం: సమర్పయామి.( పుషముతో నీరు వినాయకుని పపై చల్లవలెను)
వస్రం:
మం: సప్తాస్యాసన్ పరిధయ: త్రిస్సప్త సమధ: క్రతా:
దేవాయద్య్హజ్ఞం తన్వానా: అబధ్యన్ పురుషపశుం
శ్లో: రక్తవస్ర్తద్వయంచారు దేవయేగ్యం చ మంగళం
శుభప్రధం గృహాణత్వం లంబోదర హరాత్మజ
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ: వస్ర్తయుగ్మం సమర్పయామి.( పత్తిని ఉండలుగాచేసి తడిపి పసుపు అద్ది వస్ర్తముగా సమర్పించుట ఆచారము. అట్టివి 2 వస్ర్తములు సమర్పించవలెను).
యజ్ఞోపవీతము
మం: తంయజ్ఞం బర్హిప్రౌక్షన్ పురుషం జాతమగ్రత:
తేన దేవాఅయజంత సాధాఋషయశ్చయే
శ్లొ: రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం
గృహాణ సర్వధర్మజ్ఞభక్తానామిష్టదాయకం
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ:యజ్ఞోపవీతము సమర్పయామి ( ప్రత్తిని చేతితో కోంచెము మేర నూలువలె తీసి అక్కడ పసుపు అద్ది యజ్ఞోపవీతముగా సమర్పించవలెను).
గంధం:
మం: తస్మాద్యజ్ఞాత్సర్వహుత:సంభృతం పృషదాజ్యం
పశూగౌస్తాగౌశ్చత్రేవాయవ్యాన్, ఆరణ్యాన్ గ్రామశ్చయే
శ్లో: చందనాగరు కర్పూరకస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ట ప్రీత్యర్దం ప్రతిగుహ్యతం
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి.( వినాయకునికి గంధము ఉంగరపు వ్రేలితో సమర్పించవలెను.)
ఆభరణం:
మం: తస్మాద్యజ్ఞాత్సర్వహుత: ఋచస్సామానీజిజ్ఞిరే
ఛందాగం సి జిజ్ఞిరేతస్సాత్ యజుస్తస్మాదజాయతే
శ్లో: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్
శుభాన్, గృహాణ పరమానంద ఈశుపుత్రనమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: అలంకరణార్దాం అక్షతాన్ సమర్పయామి. (అలంకరణార్దాం అక్షతలు సమర్పింపవలెను)
పుష్పాణి:
మం: తస్మాదశ్వాఅజాయంత ఏక్ చోభయాదత:
గావోహా జిజ్ఞిరే తస్మాత్, తస్మాజ్జాతా అజావయ:
శ్లో: సుగంధాణి సుపుస్పాణిజాజీకుందముఖానిచ
ఏకవింశతి పత్రాణిసంగృహాణ నమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: పుష్పాణి పూజయామి ( వినాయకునికి పుష్పములు సమర్పింపవలెను)
అధాంగపూజ: (ఇక్కడ వినాయకుని ప్రతి అంగమును పుష్పములచే పూజించవలెను.)
ఓం గణేశాయనమ: పాదౌ పూజయామి.(పాదములు)
ఓం ఏకదంతాయనమ: గుల్ఫౌ పూజయామి. (చీలమండలు)
ఓం శూర్పకర్ణాయనమ: జానునీ పూజయామి. (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయనమ: జంఘే పూజయామి. (పిక్కలు)
ఓం అఖువాహనాయనమ: ఊరూ పూజయామి. (తొడలు)
ఓం హేరంబాయనమ: కటిం పూజయామి. (మొల)
ఓం లంబోదరాయనమ: ఉదరం పూజయామి. (కడుపు)
ఓం గణనాధాయనమ: నాభిం పూజయామి. (బొడ్డు)
ఓం గణేశాయనమ: హృదయం పూజయామి. (వక్షము)
ఓం స్థూలకంటాయనమ: కంటం పూజయామి.(కంటం)
ఓం స్కందాగ్రజాయనమ: స్కందౌ పూజయామి.(భుజములు)
ఓం పాశహస్తాయనమ: హస్తౌ పూజయామి.(చేతులు)
ఓం గజవక్త్రాయనమ: వక్త్రం పూజయామి.(నోరు)
ఓం విఘ్నహంత్రేనమ: నేత్రం పూజయామి. (కండ్లు)
ఓం శూర్పకర్ణాయనమ: కర్ణౌ పూజయామి. (చెవులు)
ఓం ఫాలచంద్రాయనమ: లలాటం పూజయామి. (నుదురు)
ఓం సర్వేశ్వరాయనమ: శిర: పూజయామి. (శిరస్సు)
ఓం విఘ్నరాజాయనమ: సర్వాంగాని పూజయామి.
ఏకవింశతి పూజ: (వినాయకుని 21 రకముల పత్రములచే (ఆకులచే) పూజింపవలెను. సంస్కృతపదము పక్కనే ఆపత్రము యొక్క తెలుగు పేరు కూడ యివ్వడమైనది.
ఇందులో కొన్ని పత్రములు సాధారణంగా పూజకు వాడనివి. కాని వినాయకచవితి రోజున అవి వాడుటకు అనుమతించబడియున్నది.)
ఓం సుముఖాయనమ: మాచీపత్రం సమర్పయామి (మాచి పత్రి)
ఓం గణాధిపాయ నమ: బృహతీ పత్రం సమర్పయామి (వాకుడు)
ఓం ఉమా పుత్రాయ నమ: బిల్వపత్రం సమర్పయామి (మారేడు)
ఓం గజాననాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి (రెండు గరికలు)
ఓం హరసూనవే నమ: దత్తూర పత్రం సమర్పయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమ: బదరీ పత్రం సమర్పయామి (రేగు)
ఓం గుహాగ్రజాయనమ: అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయనమ: తులసీ పత్రం సమర్పయామి (తులసి)
ఓం ఏకదంతాయనమ: చూతపత్రం సమర్పయామి (మామిడి)
ఓం వికటాయనమ: కరవీర పత్రం సమర్పయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయనమ: విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (విష్ణుక్రాంతి)
ఓం వటవే నమ: దాడిమీ పత్రం సమర్పయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమ: దేవదారు పత్రం సమర్పయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమ: మరువక పత్రం సమర్పయామి (మరువం)
ఓం హేరంబాయ నమ: సింధువార పత్రం సమర్పయామి (వావిలి)
ఓంశూర్పకర్ణాయనమ: జాజీపత్రం సమర్పయామి (జాజి)
ఓం సురాగ్రజాయనమ: గండకీ పత్రం సమర్పయామి (ఏనుగుచెవి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమ: శమీ పత్రం సమర్పయామి (జమ్మి)
ఓంవినాయకాయ నమ: అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి)
ఓం సురసేవితాయ నమ: అర్జున పత్రం సమర్పయామి (మద్ది)
ఓం కపిలాయ నమ: అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమ: ఏక వింశతి పత్రాణి పూజయామి
శ్రీ విఘ్నేశ్వర అష్టోతర శతనామావళి :
ఓం వినాయకాయ నమ: ఓం గ్రహపతయే నమ : ఓం అగ్రగణ్యాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ : ఓం కామొనే నమ: ఓం గ్రామణ్యై నమ:
ఓం గౌరీపుత్రాయ నమ : ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ: ఓం గణపాయనమ:
ఓం గణేశ్వరాయ నమ: ఓం పాశాంకుశధరాయ నమ: ఓం స్దిరాయ నమ:
ఓం స్కందాగ్రజాయ నమ: ఓం చండాయ నమ: ఓం వృద్ధిదాయ నమ:
ఓం అవ్యయాయ నమ: ఓం గుణాతీతాయ నమ: ఓం సుభగాయ నమ:
ఓం పూతాయ నమ: ఓం నిరంజానాయ నమ: ఓం శూరయ నమ:
ఓం దక్షాధక్షాయ నమ: ఓం అకల్మషాయ నమ: ఓం వాగీశాయ నమ:
ఓం ద్విజప్రియాయ నమ: ఓం స్వయంసిద్దాయ నమ: ఓం సిద్ధిదాయ నమ:
ఓం అగ్నిగర్వభిదే నమ: ఓం సిద్దార్చితవదాంబుజాయ నమ: ఓం దూర్వాబిల్వప్రియాయ నమ్:
ఓం ఇంద్రశ్రీప్రదాయ నమ: ఓం బీజాపూరకాయ నమ: ఓం కాంతాయ నమ:
ఓం వాళబలప్రియాయ నమ: ఓం అవ్యక్తాయ నమ: ఓం పాపహారిణేనమ:
ఓం సర్వసిద్దప్రదాయకాయ నమ: ఓం వరదాయ నమ: ఓం కృతామాయ నమ:
ఓం శర్వతనయాయ నమ: ఓం శాశ్వతాయ నమ: : ఓం సమహితాయ నమ:
ఓం శర్వప్రియాయ నమ: ఓం కృతినే నమ: ఓం వకృతుండాయ నమ:
ఓం సర్వాత్మకాయ నమ: ఓం విద్వత్రియాయ నమ: ఓం శ్రీప్రదాయ నమ:
ఓం సృష్టికర్ర్తేనమ: ఓం వీతభయాయ నమ: ఓం సౌమ్యాయ నమ:
ఓం దేవానీకార్చితాయ నమ: ఓం గణనే నమ: ఓం భక్తకాంక్షితాదాయినే నమ:
ఓం శివాయ నమ : ఓం చక్రిణే నమ: ఓం అచ్యుతాయ నమ:
ఓం శుద్దాయ నమ: ఓం ఇక్షుచాపభ్రతే నమ: ఓం కేవలాయ నమ:
ఓం బుద్దిప్రియాయ నమ: ఓం అబ్జోత్పలకరాయ నమ: ఓం సిద్దాయ నమ:
ఓం శాంతాయ నమ: ఓం శ్రీశాయ నమ: ఓం జ్ఞానినే నమ:
ఓం బ్రహ్మచారిణే నమ: ఓం శ్రీపతయే నమ: ఓం మాయాయుక్తాయ నమ:
ఓం గజాననాయ నమ: ఓం స్తుతిహర్షితాయ నమ: ఓం కాంతాయ నమ:
ఓం ద్త్వెమాతురాయ నమ: ఓం కులాద్రిభృతే నమ: ఓం బ్రహ్మిష్ఠాయ నమ:
ఓం మునిస్తుత్యాయ నమ: ఓం జటినే నమ: ఓం భయవర్జితాయ నమ:
ఓం భక్తవిఘ్నవినాశినే నమ: ఓం చంద్రచూడాయ నమ: ఓం ప్రమత్తదైత్యభయాయ నమ:
ఓం ఏకదంతాయ నమ: ఓం అమరేశ్వరాయ నమ: ఓం వ్యక్తమూర్తయే నమ: 100
ఓం చతుర్బాహవే నమ: ఓం నాగయజ్ణోపవీతినే నమ: ఓం అమూర్తకాయ నమ:
ఓం శక్తిసంయుతాయ నమ: ఓం శ్రీకంఠాయ నమ: ఓం పార్వతీశంకరోత్చంగఖేల నమ:
ఓం చతురాయి నమ: ఓం వ్రతినే నమ: ఓం నోత్చవలాలనాయ నమ:
ఓం లంబోదరాయ నమ: ఓం మూలకంఠాయ నమ: ఓం సమస్త జగదాధారయ నమ:
ఓం శూర్పకర్ణాయ నమ: ఓం త్రయికర్ర్తే నమ: ఓం వరమూషకవాహనాయ నమ:
ఓం హేరంబాయ నమ: ఓం సామఘెషప్రియాయ నమ: ఓం హృష్టస్తుతాయ నమ:
ఓం బహ్మవత్తమాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ: ఓం సర్వ సిద్ది ప్రదాయ కాయ నమ:
ఓం కాలయ నమ: ఓం స్ధూలతుండాయ నమ: ఓం సిద్దలక్ష్మి గణపతయే నమ:
దూర్వాయుగ్మ పూజ: (21గరికపోచలతో ఈపూజ చేయవలెను. క్రింది పది నామములు చదువుతూ ప్రతి నామమునకు “దూర్వాయుగ్మం” అనగా రెండేసి గరికపోచలు సమర్పించవలెను.)
ఓం గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం అఘనాశనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
7.ఓం ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మూషక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
10.ఓం కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ధూపం: మం: యత్పురుషం వ్యదధు: కతిధావ్యకల్పయన్, ముఖం కిమస్య కౌబాహూ, కావూరూ పాదా ఉచ్యేతే
శ్లో: 1. వనస్పతిరసై ర్దివ్యై ర్నానాగన్ధై స్సుసంయుతమ్– ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం – ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: ధూపమాఘ్రాపయామి.(అగరవత్తులు వెలిగించి వినాయకునికి ధూపము చూపించవలెను.)
దీపం:
మం: బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బాహూరాజన్య: కృత: ఊరూతదస్య యద్వైశ్య: పద్భ్యాగ్ం శూద్రో అజాయత
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తంవహ్ని నాయోజితం ప్రియం, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: దీపం దర్శయామి(దీపమునకు నమస్కరించి వినావకునికు చూపించవలెను.)
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.(నీరువదలవలెను.)
నైవేద్యం:
మం: చంద్రమా మనసోజాత: చక్షోస్సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ పాణాద్వాయురజాయత
శ్లో: 1. సుగన్ధా స్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాందేవ చణముద్గై: ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.
(ఒక పళ్ళెములో పళ్ళు, పాలు, నీళ్ళతో పాటు చేసిన పిండి వంటలు, వంటలు కొంచెంకొంచెము ఉంచి, నీళ్ళు చల్లుతూ తర్వాత పళ్ళెము చుట్టూ నీరు త్రిప్పుచూ వినాయకునికి నైవేద్యం చూపించవలెను.)
ఓం భూర్భువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దీమహి ధియో యోన: ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కల్పోక్త నైవేద్యం సమర్పయామి.
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయస్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అమృతాపి ధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(3సార్లు కొంచెం కొంచెం నీరు వదలవలెను.)
తాంబూలం:
మం: నాభ్యా ఆసీదన్తరిక్షమ్ శీర్ష్ణో ద్యౌస్సమవర్తత పద్భ్యాగ్ం భూమిర్దిశశ్రోత్రాత్ తధాలోకాగ్ం అకల్పయన్
శ్లో: పూగీ ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
(5తమలపాకులు, 2వక్కలు వినాయకుని వద్ద ఉంచి నమస్కరించవలెను.)
రాజనం: (కర్పూరం వెలిగించి ఈ క్రింది విధముగా చదువుతూ గంటమ్రోగించవలెను.)
మం: వేదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్ణం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్య ధీర: నామాని కృత్వా అభివదన్ యదాస్తే
సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే, తయామాసగ్ం సృజామ: సంతతశ్రీరస్త్రు, సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్త్రు నిత్యమంగళానిభవంతు
శ్లో: ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తధా నీరాజనం మయాదత్త గృహాణ వరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.
(పళ్ళెములో నీరు వదలవలెను.)
మంత్రపుష్పం (చేతిలో పువ్వులు, అక్షతలు తీసుకుని క్రింది విధముగా చదువుతూ నమస్కరించవలెను.)
మం: ధాతా పురస్తాద్యముదాజహార, శక్ర:ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్ర: తమేవం విద్వానమృత ఇహ భవతి, నాన్య: పంధా అయనాయ విద్యతే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం వశ్వశంభువం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: వేదోక్త సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలు, పుష్పములు వినాయకుని పాదములపై ఉంచవలెను.)
పునరర్ఘ్యం:
శ్లో: అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్ద్గం పాపనాశన.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: పునరర్ఘ్యం సమర్పయామి. (నీరు వదలవలెను.)
ఆత్మప్రదక్షిణ:
(అక్షతలు, పువ్వులు తీసుకుని కుడిచేతిమీదుగా తమచుట్టూ తాము తిరుగుతూ ఈక్రింది విధముగా చదువవలెను)
శ్లో: 1. యానికానిచపాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపాహం పాప కర్మాణా పాపాత్మా పాప సంభవ:
3.అన్యధశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. (అక్షతలు, పువ్వులు వినాయకుని పాదముల చెంత ఉంచవలెను.)
సాష్టాంగం:
మం: ఉరసా శిరసా దృష్ట్యామనసా వచసాతధా పద్భ్యా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: సాష్టాంగ నమస్కారం సమర్పయామి.
(సాష్టాంగ నమస్కారం అనగా ఎనిమిది అంగములతో చేయు నమస్కారము. అనగా 1.వక్షము 2.శిరస్సు 3. కండ్లు 4. మనస్సు5. వాక్కు 6. పాదములు
చేతులు 8. చెవులు. పురుషులు మాత్రమే పూర్తిగా సాగిలపడిచేయవలను.)
రాజోపచారములు: ఛత్రం సమర్పయామి, చామరంవీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి,అశ్వానారోహయామి,గజానారోహయామి, రధానారోహయామి,ఆందోళికాది సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ మనసా సమర్పయామి. (పుష్పములను సమర్పించవలెను.)
శ్లో: 1. యస్య స్మృత్యాచ నమోక్త్యా తప: పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే వివాయక.
మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం వినాయక యత్పూజితం మయాదేవపరిపూర్ణం తదస్తుతే.
అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయాంచ,భగవాన్ సర్వాత్మక శ్రీ వరసిద్ధి వినాయక దేవతా సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు.
అపరాధ క్షమార్పణ:
శ్లో: 1. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయాదాసోయమితి మాంమత్వాక్షమస్వ పరమేశ్వర.
ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వర సర్వాపరాధాన్ క్షమధ్వం
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాప్రసాదం శిరసా గృహ్ణామి.(పూజ చేసిన పుష్పములు, అక్షతలు తీసుకొని శిరస్సున ధరించవలెను.)
వ్రతం సువ్రతమస్తు
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు.
ఉద్వాసన మంత్రం: (వినాయక ప్రతిమ ఉంచిన పీటను చేతితో పట్టుకొని క్రింది మంత్రము చదువ వలెను.)
మం: యజ్ఞేన యజ్ఞ మయజంతదేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహినానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా: శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: యధాస్థానముద్వాసయామి.
హరి: ఓం తత్సత్
బ్రహ్మార్పణమస్తు
(ఇంతటితో వినాయకుని పూజావిధానము పూర్తి అయినది.)
vinayaka chavithi pooja vidhanam telugu , Vinayaka Chavithi Puja Vratha Kalpam PDF, Puja Vidhanam in Telugu PDF with Story. Ganesh Chaturthi, Vinayaka Chavithi Pooja Vidhanam Songs Download – Listen to telugu songs from Sri Vinayaka Chavithi Pooja Vidhanam MP3 songs,Vinayaka Chavithi Pooja Vidhanam Download , Vinayaka Chaturthi Vratha Puja Vidhanam ,vinayaka chavithi pooja vidhanam telugu mp3,vinayaka chavithi pooja vidhanam telugu pdf 2018,vinayaka vratha pooja vidhanam in telugu,ganesh pooja vidhanam in telugu free download,vinayaka chavithi pooja vidhanam telugu audio free download,vinayaka chavithi katha in telugu to read,vinayaka pooja in telugu audio,ganapathi pooja mantra in telugu,Vinayaka chaviti Pooja Items,
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
keywords:vinayaka chavithi pooja vidhanam telugu , Vinayaka Chavithi Puja Vratha Kalpam PDF, Puja Vidhanam in Telugu PDF with Story. Ganesh Chaturthi, Vinayaka Chavithi Pooja Vidhanam Songs Download – Listen to telugu songs from Sri Vinayaka Chavithi Pooja Vidhanam MP3 songs,Vinayaka Chavithi Pooja Vidhanam Download , Vinayaka Chaturthi Vratha Puja Vidhanam ,vinayaka chavithi pooja vidhanam telugu mp3,vinayaka chavithi pooja vidhanam telugu pdf 2018,vinayaka vratha pooja vidhanam in telugu,ganesh pooja vidhanam in telugu free download,vinayaka chavithi pooja vidhanam telugu audio free download,vinayaka chavithi katha in telugu to read,vinayaka pooja in telugu audio,ganapathi pooja mantra in telugu,Vinayaka chaviti Pooja Items,

Comments
Post a Comment