కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారు,వెండి బల్లుల విశిష్టత ఏమిటీ ?
బల్లి మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది. పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి కంచి కామాక్షి అమ్మవారి మందిరంపైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి.
కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.ఈ బల్లులను తాకుతుంటారు. బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది.ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తుంటే.. రాహుగ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
పురాణగాథ ప్రకారం:
మనపై బల్లి పడితే దోషనివారణకు కంచి క్షేత్రం వరదరాజపెరుమాళ్ ఆలయంలోని బంగారుబల్లి, వెండి బల్లిని తాకాలి. వీటిని తాకితే ఆ దోషాలు వెళ్లిపోతాయని చెబుతారు. దీనికి సంబంధించిన పురాణగాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని వారు గుర్తించలేదు.
అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు.
దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని గౌతమ మహర్షి ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా వ్యాప్తిలో వుంది.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
కంచి బంగారు, వెండి బల్లుల విశిష్టత ఏమిటీ?,కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారు బల్లిని ముట్టుకుంటే?కంచి బంగారు, వెండి బల్లుల విశిష్టత,varadaraja perumal temple, kanchipuram,Secret About Golden and Silver Lizard in Kanchi, Rectv Mystery,Effects And Remedies Of Lizard Chipkali Balli Falling On Body,Significations of Golden and Silver Lizard in Kanchi,kanchi golden lizard story in telugu,golden lizard temple timings,varadaraja temple kanchipuram,varadaraja perumal temple kanchipuram timings,Varadharaja Perumal Temple Timings, Poojas & Travel Tips,Kanchipuram Temple Information, Kachipuram Details in Telugu



Comments
Post a Comment