Shirdi Sai Baba Stotrams In Telugu | Sai Baba Astothram (108)

షిర్డీ సాయిబాబా (సెప్టెంబర్ 28, 1835 - అక్టోబరు 15, 1918) భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, మరియు యోగి.
సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు.సాయిబాబా నిశ్చయంగా దేవుడే.

సాయి స్తోత్రం

సదా సత్స్వరూపం చిదానంద కందం
జగత్సంభవస్థాన సంహార హే తుం
స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవధ్వాంతవిద్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం
జగత్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవాంబోధి మగ్నార్దితానం జనానం,
స్వపాద శ్రితానం స్వభక్తిప్రియాణం
సముద్ధారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదా నింబవృక్షస్య మూలాధివాసత్
సుధాస్రావిణం తిత్క మప్య ప్రియం తం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుధ్యా సపర్యాది సేవాం
నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అనేకాశ్రుతా తర్క్య లీలావిలాసై
సమవిష్కృతేసాన భాస్వత్ప్రభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సతాం విస్రమారామ మేవాభిరామం
సదా సజ్జనై సంస్తుతం సన్నమధ్భి
జనామోదదం భక్తభద్ర ప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అజన్మాధ్యమేకం పరం బ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణం
భవద్దర్శనాత్సంపునీతహ్ ప్రభొహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

శ్రీ సాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్ధిప్రద
యుష్మత్పాదరజహ్ ప్రభావమతులం ధాతపివక్తాక్షమహ్
సద్భక్త్యా శరణం కృతాంజలిపుటహ్ సంప్రాపితోస్మి ప్రభో
శ్రిమత్సాయి పరేశపాదకమలా న్నాన్యచ్ఛరణ్యం మమ

సాయిరూప ధర రాఘవోత్తమం
భక్తకామ విభుధ ధ్రుమం ఫ్రభుం.
మాయయోప హతచిత్త సుద్ధయే
చింతయా మ్యహ మహర్నిశం ముదా

శరత్సుధాంశు ప్రతిమప్రకాసం
కృపాతపత్రం తవ సాయినాథ
త్వదీయపదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయా తాప మపాకరోతు

ఉపాసనాదైవత సాయినాథ
స్తవైర్మయోపాసనినా స్తుతస్త్వం
రమేన్మనో మే తవ పాద యుగ్మే
భృంగో యథాబ్జే మకరందలుబ్ధహ్
అనేకజన్మార్జిత పాపసంక్షయో
భవేధ్భవత్పాద సరోజ దర్సనాత్
క్షమస్వ సర్వా నపరాధ పుంజకాన్
ప్రసీద సాయిస! గురో! దయానిధే 

శ్రీ సాయినాథ చరణామృత పూత చిత్త
స్తత్పాద సేవనరతా సతతం చ భక్త్యా
సన్సార జన్య దురితౌఘ వినిర్గతాస్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి

స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యో నరస్తన్మనా సదా
సద్గురు సాయినాథస్య కృపా పాత్రం భవేధ్ధ్రువం
శ్రీ షిరిడీ సాయి అష్టోత్తర శతనామావళి

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

keywords:
Sai stotram, sai stotram in telugu, sai stotram in telugu script, sai stotram mp3, sai stotram lyrics, shirdi sai stotram telugu,sai,sadguru shirdi sai stotram telugu,

Sai Baba Ashtottara Sata Namavali in telugu,Sai baba Slokas In telugu,Sai Mantram,Sai Baba Slokas,Sai baba Slokas In PDF,Sai Baba Ashtottara Sata Namavali In Telugu,Sri Shirdi Sai Baba Mahatyam,Sri Shirdi Sai Baba  Photos,Sri Shirdi Sai Baba  Images And Hd Photos,Sai Baba Quotes,ashtothram,slokas in telugu,All Gods Ashtottarams,All Goddess Slokas and Mantras,Telugu Slokas,Ashtottarams in telugu  

Comments