శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం | Srisailam Mallikarjuna jyotirlinga Temple History In Telugu | 12 Jyotirlingas | Bhakthi Margam

పురాతన కాలంనాటి మన హిందూ మత, సాంస్కృతిక మరియు సాంఘిక చరిత్రలో శ్రీశైల క్షేత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పూర్వ చారిత్రాత్మక అధ్యయనాల ప్రకారం శ్రీశైలం సుమారు 30,000-40,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది.అన్ని సంవత్సరాల క్రితం నాటి రాతి ఉపకరణాలు శ్రీశైలం యొక్క వివిధ ప్రదేశాలలో విస్తారంగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకులు మరియు ఆంధ్రదేశం యొక్క పూర్వపు పాలకులు అయిన శాతవాహనులతో శ్రీశైలం యొక్క చరిత్ర మొదలయ్యిందని శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి.

కొండ ప్రాంతమైన శ్రీశైలం యొక్క మొట్టమొదటి చారిత్రక ప్రస్తావనను 2 వ శతాబ్దంలో మల్ల శతకరనికి చెందిన పులుమవిల నాసిక్ శిలాశాసనంలో గుర్తించవచ్చు, ఈ ప్రాంతమును శాతవాహనులకు చెందిన మల్ల శతకరని పరిపాలించేవాడు అందుకే అతడిని పవిత్ర దేవుడైన మల్లన్నగా పిలిచేవారు.
కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట కొంగు బంగారమై శ్రీశైలముపై భ్రమరాంబా సమేతుడై కొలువైఉన్నాడు "మల్లికార్జున స్వామి”. ఎంతో పరమపవిత్రమైన ఈ క్షేత్రం భారతదేశములోని ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము ఇక్కడ స్వామి వారు స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీ అని పిలుస్తారు. ఈ క్షేత్రాన్నిఒకసారి దర్శించిన ముక్తికలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.
శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. క్రీ.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది. 
అన్ని ప్రత్యకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతములో కృష్ణానది తీరములో ఉంది.మరో ముఖ్యవిశేషమేమిటంటే ఇక్కడ నివసించే కొండజాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా భ్రమరాంబిక అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు.ఇక్కడ పూజలలో కూడా వీరు పాలుపంచుకుంటారు.ఇక్కడ శివరాత్రి సందర్బంగా నిర్వహించే రధోత్సవములో వీరే రథాన్ని లాగుతారు.స్వామివారి ఆలయాన్ని శాతవాహనులు,పల్లవులు,ఇక్ష్వాకులు,కాకతీయులు,విజయనగరాధీశులు ఇలా ఎంతో మంది చేస్తూవచ్చారు.
ఈ ఆలయం గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది. స్వామి వారిని త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు వనవాస సమయములో సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడట. అలాగే ద్వాపరయుగములో పాండవులు కూడా స్వామి వారిని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారట. ఎంతోమంది ఋషులు స్వామి వారి ఆలయ ఉన్న ప్రాంతములో తపమొనరించి ముక్తిమార్గం పొందారు. అలాగే శ్రీశంకరాచార్యులు వారు స్వామి వారి ఆలయప్రాంగణంలోనే అమ్మవారి మీద భ్రమరాంభికాష్టకాన్ని శివునిపై శివానందలహరిని రచించారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.
శ్రీశైల దేవాలయ ప్రాంతము:
ప్రధాన ఆలయాలు అయినా మల్లికార్జున మరియు భ్రమరాంభ వేరువేరుగా నిర్మించబడి మరియు ప్రత్యేక ఆలయాలు, స్థంభాలతో కూడిన అనేక ఉప పుణ్యక్షేత్రాలు, మండపాలు మొదలైనవి ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయం చుట్టూ క్లిష్టమైన భారీ రాళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారమును నిర్మించారు. ప్రాకారమునకు ముఖ్యంగా నాలుగు వైపులా నాలుగు ద్వారములు ఉన్నాయి తూర్పు వైపు ఉన్న ద్వారము "మహద్వారము"
అంతర్గత ఆలయ ఆవరణలో నందిమండపం, వీరశిరోమండపం, మల్లిఖార్జున ఆలయం మరియు భ్రమరాంభ ఆలయం అన్ని తూర్పు నుండి పడమరకు వరుసగా ఉన్నాయి. వృద్ధ మల్లిఖార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్థనారీశ్వర, వీరభద్ర, ఉమా మహేశ్వర దేవాలయం మరియు పాండవ ప్రతిష్ట దేవాలయాలు అనే ఐదు ఆలయాల సమూహం మరియు నవబ్రహ్మ దేవాలయాలు అనే తొమ్మిది ఆలయాలు మరి కొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.
ఇతిహాసాలు:
పర్వతుడి యొక్క కథ:
శిలాద మహర్షి కుమారుడు పర్వతుడు, పర్వతుడు శివుడి కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యేక్షమై ఏమి కావాలో అడగగా పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా నువ్వు నన్ను పర్వతముగా మార్చి నాపై కొలువుండే వరం ప్రసాదించమని మరియు అన్ని భగవానుల పవిత్ర జలాలు శాశ్వతంగా నాపైనుండి ప్రవహించాలని కోరుకున్నాడు. పర్వతుడి ఆకారం పెద్ద కొండ 'శ్రీశైలం'గా అవతరించింది మరియు శివుడు శ్రీ పర్వత స్వామిగా పర్వతం పైభాగంలో వెలిసాడు.
అరుణాసురుడి యొక్క కథ:
హిందూ మత పురాణాల ప్రకారం, అరుణాశురుడనే రాక్షసుడు సాధుజనులను పరమభాదలు పెడుతుంటే అది సహించలేని పార్వతి దేవి కోపోద్రిక్తురాలై భ్రమర రూపిణి అయి నాదం చేస్తూ అరుణాశురుడిని సంహరించింది. అమ్మవారు భ్రమర రూపం దాల్చి దుష్టసంహారం చేశారు కావున భక్తులు భ్రమరాంభికాదేవిగా కొలుస్తారు. ఇక్కడ జరిగిన దక్ష యజ్ఞములో సతీదేవి యొక్క మెడ భాగాన్ని ఉంచారు అందుచే ఈ స్థలం శక్తి పీఠం గా మారింది.
చంద్రవతి యొక్క కథ:
సాహిత్య ఆధారాల ప్రకారం, శ్రీశైలం దగ్గరలో ఉన్న చంద్రగుప్త పట్టణంను పరిపాలించే రాజు యొక్క కూతురు ఈ చంద్రవతి. చంద్రవతి ఆమె తండ్రికి దూరంగా శ్రీశైలం కొండల్లో కొంత మంది సేవకులతో ఉండేది.
ఒక రోజు ఆమె పశువులు ఒక శివలింగమును పోలి ఉన్న సహజ రాతి నిర్మాణం పైన నిలబడి అది దాని పాలతో అభిషేకం చేయడంతో ఆమె శివుడు యొక్క స్వీయ లింగముగా భావించి రోజు పూజలు నిర్వహిస్తుండేది.ప్రతి రోజు మల్లెపూల దండను(మల్లికా పుష్పం) స్వామి వారికి సమర్పిస్తూ ఉండేది.ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యేక్షమై వరము కోరుకోమ్మని అడగగా నేను మీ శిఖరముపై ఉంచిన మల్లెపూలదండ ఎన్నటికీ వాడిపోకుండా శాశ్వతముగా ఉండేలా వరం ప్రసాదించమని అడిగింది అపుడు శివుడు ఆ మల్లెపూల దండను శిరముపై గంగా, చంద్రవంకల మద్య దరిస్తాడు.ఇలా తలపై మల్లెపూల దండ ధరించాడు కావున స్వామిని మల్లిఖార్జునుడయ్యాడనీ(మల్లికా-అర్చిత-స్వామి) ప్రతీది.
వాసుమతి యొక్క కథ:
కథ ప్రకారం వాసుమతి ఈ పర్వతం పైన బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ఆమె తపస్సుకు బ్రహ్మ ఆనందించి, ఆమెకు కనిపించాడు.అప్పుడు ఆమె పేరును "శ్రీ"గా మరియు అదే పేరుతో వచ్చేలా ఈ కొండను శ్రీ-శైలంగా అని పేరు పెట్టాలని కోరింది.అలాగే శ్రీశైలముగా పిలవబడుతుంది.
వృద్ధ మల్లిఖార్జున స్వామి యొక్క కథ:
శివ భగవంతుడిని పూజించే ఒక రాజకుమారి అతడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది.ఒక రోజు ఆ రాజకుమారి కలలో శివుడు వచ్చి ఒక నల్ల తుమ్మెదను అనుసరిస్తూ రమ్మని చెప్పాడు అప్పుడు ఆమె నిద్ర నుండి మేల్కొని తేనెటీగను కనుక్కొని శ్రీశైల పర్వతమును చేరుకుంది కానీ తేనెటీగ చివరకు ఒక మల్లెల పొదలో స్ధిరపడుతుంది ఆ రాజకుమారి శివుని కోసం అక్కడే ఉండి పోతుంది.అక్కడ ఉన్న చెంచు జాతుల వారు ప్రతిరోజు తేనె మరియు అడవి పండ్లతో ఆమెను పెంచుతారు.
చాలా ఏళ్ల తర్వాత శివుడు ముసలి మరియు ముడతలు పడిన ముఖంతో ఆమె ముందుకు వస్తాడు.ఆ రాజకుమారి అతనిని వివాహం చేసుకుంటుంది. వివాహం సందర్భంగా చెంచు జాతి వారు విందుకు మాంసం మరియు పానీయాలతో ఆహ్వానించారు. శివుడు ఆ భోజనాన్ని అంగీకరించలేదు, అయితే రాజులు అతనిని పట్టుబట్టడానికి ప్రయత్నించారు. చివరగా శివుడు ఆ స్థలం వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె అతనిని ఒక రాయి (లింగం)గా మార్చింది మరియు అతను వృద్ధ మల్లికార్జున స్వామిగా అయ్యారు.
చెంచు మల్లయ్య యొక్క కథ:
స్థానిక గిరిజన చెంచు జాతి వారి కథనం ప్రకారం, ఒక సందర్భంలో శివుడు శ్రీశైలం అడవికి వేటగాడిగా వచ్చి,చెంచు జాతి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, ఆమెను వివాహం చేసుకుని, కొండపై స్థిరపడినాడు. మల్లికార్జున స్వామిని వారి సంబంధంతో చూస్తూ శివుడిని చెంచు మల్లయ్యగా పిలుస్తారు. ఈ కథ ఆలయం యొక్క ప్రహరీ గోడపై కూడా లిఖించబడి ఉంది.
ఇక్కడ చూడాల్సినవెన్నో... 
అనేక ప్రత్యేకతలున్న శ్రీశైల ఆలయానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశంజిల్లాలో త్రిపురసుందరి వెలసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగానూ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో జోగులాంబ విరాజిల్లే శక్తిపీఠమైన ఆలంపూర్‌ పశ్చిమ ద్వారంగానూ, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువుతీరిన సిద్ధవటం దక్షిణద్వారం గానూ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఉమామహేశ్వరాన్ని ఉత్తర ద్వారంగానూ భావిస్తారు. ఇవి కాకుండా - ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి.

శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు. గిరిపంక్తుల్ని దాటి వెళ్తుంటే ఆలయానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖరదర్శనం సర్వపాపహరణమని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభాకారుడు కేశప్పను స్వర్ణలింగ రూపంలో శివుడు అనుగ్రహించిన హటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసిన పాలధార, పంచధారలు, తన జననీ జనకుల్ని దర్శించవచ్చిన వారి మోక్షార్హతను నిర్ధరించే సాక్షి గణపతి, కుంతీసుత మధ్యముడైన భీమసేనుడి గదాఘాతంతో ఏర్పడిందని భావించే ‘భీముని కొలను’ ఇలా శ్రీశైల యాత్రలో విధిగా సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.ఘంటా, విభూతి, సారంగభావ, నందుల, భీమశంకర మఠాలు; అలాగే మల్లమ్మ పన్నీరు, పశుపతినాథలింగం, గోగర్భం, విశ్వామిత్ర మఠాలు కూడా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడి నందీశ్వరుడి ప్రస్తావన ఉంది. ‘శనగల బసవన్న’ అని పిలిచే ఈ పశుపతి వాహనం, కలియుగాంతంలో పెద్ద రంకె వేస్తాడని కాలజ్ఞాన కర్త పేర్కొన్నారు.
నందిమండపం:
ఆలయం యొక్క మహాద్వారం దాటిన వెంటనే ఈ నందిమండపము ఉంటుంది. ఇది పెద్ద పరిమాణముతో కలిగిన స్తంభాలతో నిర్ణిత చదరపు ఆకారంలో ఈ మండపం ఉంది. ఈ మండపమునకు 42 స్తంభాలు కలిగి అందులో తూర్పు వైపు ఉన్న వాకిలిలో ప్రతి రెండు స్తంభములు మరియు మధ్యలోని నాలుగు స్తంభములు బంగారు వర్ణాలతో అలంకరించబడిన రూపకల్పన కలిగి ఉంటాయి తక్కిన స్తంభాలు సాధారణంగా ఉంటాయి. ఈ మండపం స్తంభాలపై అరుదైన శిల్పకళ చెక్కబడి ఉంది. ఈ అలంకరణలు స్పష్టంగా విజయనగర కాలం నాటివిగా ఉంటాయి.
వీరశిరోమండపం:
ఈ వీరశిరోమండపం 1378 AD సంవత్సరంలో రెడ్డి రాజు అనవేమా రెడ్డి నిర్మించారు. నందిమండపానికి పశ్చిమాన ఈ వీరశిరోమండపం నిర్మించబడినది. వెలువడిన శాసనం ప్రకారం, ఈ మండపం వీరశైవుల ద్వారా దేవునికి వారి సొంత తలలు, చేతులు మరియు నాలుక ప్రయోజనం కోసం నిర్మించారు, ఈ పద్ధతిని వీరాచారంగా పగణించుకునే వారు. ప్రస్తుతానికి ఈ మండపం 16 స్తంభాలు కలిగిన ఒక సాధారణ నిర్మాణం.
శ్రీమల్లికార్జునుని దేవాలయము: 
అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.
భ్రమరాంబిక అమ్మవారి గుడి:
భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.
మనోహర గుండము:
శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.
నాగ ప్రతిమలు:
పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి.
అద్దాల మండపము:
వృద్ద మల్లికార్జున లింగము: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

keywords:
Sri Mallikarjuna Swamy Temple, Srisailam,Mallikarjuna Jyotirlinga,Srisailam Mallikarjuna Temple (Jyotirlinga),Srisailam Temple,srisailam temple timings,srisailam temple photos,srisailam temple videos,srisailam temple contact number,srisailam temple accommodation online booking,srisailam temple history in telugu,srisailam temple Pooja,Timing,Darsan,Place,Rooms Booking,Online Rooms Booking.Temples Phone Number,

Comments