భైరవాష్టమి | Significance of Kalabhairavastami | kalabairavar Telugu | bhakthi margam | భక్తి మార్గం


భైరవాష్టమి పరమశివుడు బ్రహ్మకు భైరవ స్వరూపాన్నిచూపిన రోజు

మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి దీనినే భైరావాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు.ఈ స్వామి వాహనం శునకం(కుక్క)అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు.ఈ భైరవావతారానికి గల ఒక కారణం ఉంది అని పెద్దలు చెబుతారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ ,విష్ణువు మధ్య వివాదాంశం తలెత్తింది.విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? ఇది చర్చకు దారి తీసింది.
అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు-సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తెల్చిచెప్పాడానికి వీలుకానిది ఈ సమస్య దీనికి కారణం మీరిద్దరూ ఆశక్తి విభూతి నుండే ఏర్పడిన వారే కదా! అన్నారు ఋషులు. ఈ వాదనను అంగీకరించిన శ్రీ మాహావిష్ణువు మౌనం వహించాడు.కాని బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. 
ఆ పరతత్వం మరెవరోకాదు ,నేనే అని బ్రహ్మ అహంను ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు.ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావటంతో "కాలభైరవాష్టమి" గా ప్రసిద్ధి చెందింది. మన పురాణాల ప్రకారం రౌద్ర స్వరూపుడు ,అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని ఎనిమిది రకాలు.

వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.

ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి.

నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు.కాలస్వరూపం తెలిసిన వాడు.కాలంలాగే తిరుగులేనివాడు.

ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు. భక్తిశ్రద్ధలతో కొలిచే వారు "ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌" అని ప్రార్థిస్తారు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని,సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. 

ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. 

కాలభైరవ జయంతి ప్రాముఖ్యత:

శివుని అనుచరులకు కాలభైరవ జయంతి రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజు శివుని యొక్క భయంకరమైన అభివ్యక్తిగా పిలువబడే లార్డ్ కాల భైరవుని పుట్టినరోజును స్మరించుకుంటుంది. హిందూ ఇతిహాసాల ప్రకారం, బ్రహ్మ, విష్ణు మరియు మహేషులు తమ ఔన్నత్యాన్ని గురించి చర్చిస్తున్నప్పుడు, బ్రహ్మ యొక్క కొన్ని వ్యాఖ్యలతో శివుడు ఆగ్రహానికి గురయ్యాడు. అప్పుడు భైరవుడు శివుని నుదిటి నుండి ప్రత్యక్షమయ్యాడు మరియు బ్రహ్మ యొక్క ఒక తలని కత్తిరించాడు, అతనికి నాలుగు తలలు ఉన్నాయి. 
భైరవుడు పాపులను శిక్షించేందుకు రాడ్ పట్టుకుని కుక్కపై ప్రయాణిస్తున్నాడు. కాలభైరవ జయంతి రోజున భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి శివుడు మరియు భైరవుడిని పూజిస్తారు. ఈ రోజున కాలభైరవుడిని పూజించడం వల్ల మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని ప్రసాదిస్తుంది. కాల భైరవుడిని ఆరాధించడం ద్వారా అన్ని 'రాహు' మరియు 'శని' దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : bhakthi margam , bhakthi margam.in , Kalabhairava Jayanthi ,significance of kalabhairavastami , 
Kala Bhairava worship day in week,Kala Bhairava Ashtami dates 2023,Kala Bhairava Jayanti 2023,Bhairavashtami 2023,Kalashtami is good or bad,కాల భైరవ అష్టకం,Batuk Bhairav day,Kala Bhairava Pooja benefits, Kalabhairava story in telugu, Kalabhairava avatharam in telugu,  bhakthi margam , bhakthi margam.in , Kalabhairava Jayanthi, Kalabhairava Ashtakam In Telugu, kalabhairava ashtakam telugu pdf download, kalabhairava ashtakam lyrics, kalashtami 2023, Karthika Masam kalashtami 2023, kalashtami is good or bad, kalashtami Pooja Vidhanam In Telugu, kalabhairava ashtakam telugu pdf, kalabhairava stotram in telugu

Comments