శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి ? | Shivalaya Pradakshina Rules In Telugu | Bhakthi margam | bhakthi margam | భక్తి మార్గం

శివాలయాల్లో అన్ని గుడుల‌లో మాదిరిగా ప్రదక్షిణలు చేయ‌కూడ‌దు

దేవాల‌యానికి మాన‌వ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. దేవాల‌యానికి వెళ్తే మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌ల‌గ‌డ‌మే కాదు, ఆ ప‌రిస‌రాల్లో ఉండే పాజిటివ్ శ‌క్తి మ‌న‌లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వ‌స్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని ద‌ర

గ‌ర్భ గుడిలో ఉన్న శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా. ప‌క్క‌నే లింగాన్ని అభిషేకించిన జ‌లం వెళ్తూ ఉంటుంది. దాని కిందే చండీశ్వ‌రుడు కొలువై ఉంటాడు. శివాలయంలోకి వెళ్ల‌గానే నేరుగా శివుని గ‌ర్భ‌గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌కూడ‌ద‌ట‌. ముందుగా నందీశ్వ‌రుని వ‌ద్ద ప్ర‌ద‌క్షిణ ప్రారంభించి చండీశ్వ‌రుని వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న్ను ద‌ర్శించుకుని మ‌ళ్లీ వెన‌క్కి రావాలి. 


ఒకసారి చండీశ్వ‌రుని ద‌ర్శించుకుని వెన‌క్కి వ‌చ్చి నందీశ్వ‌రుని వ‌ద్ద ఆగి అటు నుంచి గర్భ‌గుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జ‌లం వ‌ద్ద‌కు రావాలి. అక్క‌డి నుంచి వెన‌క్కి తిరిగి నందీశ్వ‌రుని వ‌ద్ద‌కు వ‌చ్చి ప్ర‌ద‌క్షిణ పూర్తి చేయాలి. ఇలా 3 సార్లు చేస్తే చాలు దాంతో ఎంతో ఫ‌లితం క‌లుగుతుంద‌ట‌.

సాధార‌ణంగా భ‌క్తులు దేవాల‌యాల్లో 3 సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. ఇందులో ఒక‌టి గుడిలో దేవుడికి, రెండోది పూజారికి, మూడోది గుడి క‌ట్టిన విశ్వ‌క‌ర్మ‌కు. కానీ పైన చెప్పిన విధంగా శివాల‌యంలో ప్ర‌ద‌క్షిణ చేస్తే అది 10 వేల ప్ర‌ద‌క్షిణ‌ల‌తో స‌మాన‌మ‌ట‌. దీని గురించి లింగ పురాణంలో చెప్పారు. అయితే పైన చెప్పిన‌ట్టుగా కాక శివుని గ‌ర్భ‌గుడి చుట్టూ గుండ్రంగా ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే లింగాన్ని అభిషేకించిన జ‌లం వెళ్లే దారి వ‌ద్ద ప్ర‌మ‌ధ గ‌ణాలు కొలువై ఉంటాయ‌ట‌. వాటిని దాటి ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే త‌ప్పు చేసిన‌ట్టు అవుతుంద‌ట‌. కొద్దిగా ప్ర‌య‌త్నిస్తే పైన చెప్పిన‌ట్టుగా ప్ర‌ద‌క్షిణ చేయ‌డం సుల‌భ‌మేన‌ని పండితులు చెబుతున్నారు.

పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ

పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ
గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు.

శివాలయ ప్రదక్షిణా విధానం: చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం: 


మిగిలిన దేవాలయాలలో వలే ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు

లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది..! 

నందీశ్వరుని (ధ్వజస్థంభం)వద్ద ప్రారంభించి - ధ్వజస్థంభం దగ్గర నుండి చండీశ్వరేని దర్శించుకుని, అక్కడ నుండి మళ్లీ వెనకకు తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ...ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం (అభిషేకజలం బయటకు పోవుదారి )వరకు వెళ్ళి వెనుకకు తిరిగి మరలా ధ్వజస్థంభం దగ్గర ఒక్క క్షనం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడి నుండి... ప్రదక్షిణ మొదలు పెట్టి, సోమసూత్రం (అబిషేక జంల బయటకు పోవుదారి) వరకు వెళ్ళీ వెనుకకు తిరిగి మరలా ద్వజస్థంభం దగ్గర ఒక్క క్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకూ రావాలి. అక్కడి నుండి...తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది.

లింగ పురాణంలో 

వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక ‘‘శివ ప్రదక్షిణ '' పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. (సోమసూత్రం దగ్గర ప్రమథ గణాలు కొలువై ఉంటాయంటారు. అందుకే వారిని దాటితే తప్పు చేసినవారమవుతాం) . కొద్దిగా సాధాన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.

ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఈ రోజుల్లో ప్రదక్షిణం అంటే ఒక అరగంట ఎక్సర్ సైజ్ చేస్తే మంచిది కదా అనే జనరేషన్ తయారయింది.

ప్రదక్షిణం చేసేటప్పుడు.. 

మనస్సు, తనువు అన్నీ భగవంతునిపై లగ్నం చేయడం వల్ల ప్రదక్షిణం శరీరంలోని , మనస్సులోని బాధలను హరించివేస్తుంది. అందువల్ల కేవలం శారీరరకంగానే కాక ఆధ్యాత్మికంగా , వ్యక్తిగతంగా ఉఛ్ఛస్థితికి చేరుకోవచ్చు.

మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం. ప్రస్తుతం మనం చేసే నాన్ డూయింగ్ మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం. గుడిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోని శక్తిని మెరుగుపరుస్తుంది. మనస్సును ఉల్లాసపరుస్తుంది. అది ఏ ఆలయంలో ప్రదక్షిణ అయినా సరే...

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : bhakthi margam , bhakthi margam.in , dakshinamurthi , dakshinamurthyi mantras , history of dakshinamurthy , శివాలయాల్లో అన్ని గుడుల‌లో మాదిరిగా ప్రదక్షిణలు చేయ‌కూడ‌దు, secrets of pradhakshana in shivalayam,lord shiva , shivalayam pradhakshana , secrets of shivalayam, Sivalayam lo Pradakshina Ela Cheyali in Telugu, Shivalaya Pradakshina , why no full pradakshina in shiva temple, shiva pradakshinam in telugu, shiva pradakshinam vidhanam in telugu, shiva pradakshina vidhanam in telugu

Comments