శబరిమల అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర | Sabarimala Temple History in Telugu | Sabarimala History in Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
శబరిమల అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర
కార్తీకమాసం మొదలుకాగానే గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం.. శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢసంకల్పంతో చేసే దీక్ష అయ్యప్ప దీక్ష. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి 18 కొండలు, 18 మేట్లపై అధిష్టించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప ఆలయాల్లో దీక్ష స్వాములతో మారుమోగుతుంటాయి. ఈ మాసంలో 41 రోజుల పాటు అయ్యప్పమాలాధారణతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.
ఆలయ చరిత్ర
ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. పంబ నది దగ్గర నుంచి శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు.
అయ్యప్ప స్వామి ఆలయం అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండటంతో అయ్యప్ప మాల వేసిన ప్రతిఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి, ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు(18)పై నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు.
ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.
అయ్యప్ప జననం
శబరిమల ఆలయంలో మకర జ్యోతి, భక్తులు దీనిని ఒక అద్భుతం అని నమ్ముతారు.
ఛైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి - సోమవారము నాడు జన్మింఛినారు . జ్యోతి రూపంగా అంర్ధానమయిన రోజు -- మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది.
ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు.
అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.
41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తులు ఎన్నో వ్యయప్రయాసలతో.. ఇరుముడితో ధరించి 18 కొండలు దాటుకుంటూ స్వామివారి సన్నిధానానికి చేరుకుని శబరిగిరుషున్ని దర్శించుకుంటారు.
అక్కడ 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ‘పదునెట్టాంపడి’ అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియమ నిష్టలతో కఠోర దీక్ష చేపట్టిన ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. సన్నిధానంలోని 18 మెట్లకు నమస్కరిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అలా ఎక్కిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు ఆలయంలో స్వామివారు కొలువుదీరిన సందర్భంగా 18 వాయిద్యాలు మోగించారని చెబుతుంటారు.
- స్వామివారి సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలకు సంబంధించినవి. కళ్లు, చెవులు, ముక్కు, జిహ్వ, స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి.
- తర్వాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామ, క్రోదం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది.
- తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి.
- ఇక చివరి రెండు మెట్లు విద్య, అవిద్య.. అంటే అజ్ఞానంను సూచిస్తాయి. ఎవరైతే ఈ 18 మెట్లను భక్తిభావంతో, గౌరవంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ దిగివస్తారు.
18 మెట్లకు మరో కథ :
ఈ 18 మెట్లకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్పస్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా పేర్కొంటారు. స్వామివారు సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చకముందు వాటిని ఒక్కో మెట్టు వద్ద ఉంచారని చెబుతుంటారు. స్వామివారి ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను కూడా దాటాల్సి ఉంటుంది. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కూడా ప్రచారంలో ఉంది. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని, రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 18 సంఖ్యకు.. అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి ‘పుణ్యదర్శనం’ లభిస్తుందని చెబుతున్నాయి.
Contact
Website: www.swamyayyappa.in
Email: info@swamyayyappa.in

Comments
Post a Comment