ప్రతి ఇంట్లో తప్పకుండా ఈ దేవుడి ఫోటో ఖచ్చితంగా ఉండి తీరాలి | dakshinamurthy photo at home In Telugu | Dakshinamurthy Stotram In Telugu | bhakthi margam | భక్తి మార్గం


దక్షిణామూర్తి స్తోత్రం

దక్షిణామూర్తికి అంకితం చేయబడిన అనేక మంత్రాలు ఉన్నాయి. భగవంతుడు దక్షిణామూర్తి రక్షణ కోసం, మొత్తం శ్రేయస్సు కోసం అలాగే విద్యలో విజయం కోసం ప్రార్థిస్తారు.

దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణా మూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని చిలకమర్తి తెలిపారు.

అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అది జ్ఞాన సంపాదనకు, మోక్షసాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు. అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి, జ్ఞానాలను ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి .

ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలి, దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణా మూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని చిలకమర్తి తెలిపారు. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటు వంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు  చెప్పుచున్నాయి

దక్షిణామూర్తి స్తోత్రం

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకామూర్తయే ! నిర్మాలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః !! చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే  ! ఓంకారవాచ్యరూపాయ దక్షిణామూర్తయే నమః !! గురవే సర్వలోకానాం భిషజే భవరోగినమ్ ! నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః !!

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురు:సాక్షాత్‌ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్‌

యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |

తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం

ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||

స్తోత్రం

విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా |
యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || ౧ ||

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్ననిర్వికల్పం
పునర్మాయా కల్పిత దేశ కాలకలనా వైచిత్ర్య చిత్రీకృతమ్‌ |
మాయావీవ విజృంభయాత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || ౨ ||

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వ మసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || ౩ ||

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్‌
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విధు:
స్త్రీబాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదిన: |
మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్‌
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽ భూత్సుషుప్తః పుమాన్‌ |
ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||

భూరంభాంస్యనలోఽనిలోంఽబర మహర్నాథో హిమాంశుః పుమాన్‌
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‌ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో:
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్‌ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్‌ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతమ్‌ || 10 ||

|| ఇతి శ్రీ శంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ ||

ధ్యానం

ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 ||

వటవిటపి సమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్‌ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా |
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః || ౩ ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్‌ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || 4 ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || 5 ||

చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః || 6 ||

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || 7||

అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినాం |
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః || 8||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : Why Dakshinamurthi statue/photo should face south ,  bhakthi margam , bhakthi margam.in , dakshinamurthi , dakshinamurthyi mantras , history of dakshinamurthy , Dakshinamurthy Stotram , దక్షిణామూర్తి స్తోత్రం, dakshinamurthy stotram pdf, dakshinamurthy stotram lyrics, dakshinamurthy stotram lyrics telugu, dakshinamurthy stotram telugu mp3 free download, dakshinamurthy stotram in telugu by chaganti, dakshinamurthy stotram in telugu pdf free download, dakshinamurthy photo in house, dakshinamurthy photo direction in home, how to keep dakshinamurthy photo at home in telugu, which direction to keep dakshinamurthy photo in telugu, dakshinamurthy facing direction, dakshinamurthy photo direction in telugu, dakshinamurthy stotram in telugu, dakshinamurthy stotram benefits, dakshinamurthy stotram benefits intelugu, Bhakthimargam, bhakthi margam, bhakthi margam telugu

Comments