మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే కోట్ల జన్మల పుణ్యం | Mahalaya Amavasya in Telugu | Mahalaya Paksha 2023 | Bhakthi Margam
మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే కోట్ల జన్మల పుణ్యం
మహాలయ పక్షం 30 సెప్టెంబర్ నుండి ప్రారంభమై అక్టోబర్ 14 మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమనిపేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
భాద్రపద బహుళ పాడ్యమి తిథి నుంచి మహాలయ పక్షం ఆరంభమవుతుంది. ఇది వేదకాలం నుంచీ ఆచరణలో ఉన్న పండుగ. దీనినే పితృ పక్షమని కూడా అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది. ఆ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది పితృ దేవతల పూజకు ఉర్ధిష్టమైనది. సాధారణ శ్రాద్ధ దినం వ్యక్తులకు సంబంధించినది. మహాలయ పక్షము సాముదాయకంగా పితరులను పూజించడానికి ఏర్పడింది. మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి 96 శ్రాద్ధాలని చెప్పారు. వీటిలో పితృ పక్షం ముఖ్యమైనది. శ్రాద్ధ దినం నాడు కర్మ చేసే వాడు శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
తండ్రి బతికి ఉండగా తల్లిని కోల్పోయిన వాడు భాద్రపద కృష్ణ పక్ష నవమి నాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు గంట కాలం పుచ్చుకుంటుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసే వాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై ఉంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి. ఇదే విధంగా తండ్రికి కూడా శ్రాద్ధకర్మను నిర్వహించాలి. పురోహితులు సూచించిన మేరకు దర్భగడ్డి మీద అవిసె చెట్టు ఆకులు వేస్తారు. దాని మీద విష్ణు పాదమనే ఆకు వేస్తారు. దాని మీద పిండాలు ఉంచుతారు. ఇవి పెద్ద పిండాలు.
ఈ పిండాల పక్కన చిన్న పిండాలు, మరికొన్ని ధర్మ పిండాలు ఉంచుతారు. వీటినన్నింటినీ పూజిస్తారు. తరువాత దీపారాధన చేస్తారు. ఆ మీదట మంత్ర పుష్పాంజలి చేస్తారు. చివరగా నైవేద్యపు వస్తువును ఆరుబయట కాకి తినడం కోసం ఉంచుతారు. కాని ఈ నైవేద్యాన్ని కాకి ఎంత తొందరగా ముట్టుకుంటే పితృ దేవతలు అంత ఎక్కువగా తృప్తి పడ్డారని తలుస్తారు.
ఇలా కర్మ చేయడానికి పాలుమాలిన తమ వంశీకుడిని పితృ దేవతలు శపిస్తారని అంటారు. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధ కర్మ చేయడం మహత్కార్యంగా మహారాష్ట్రులు భావిస్తారు. ఈ రోజు శ్రాద్ధ కర్మ చేయలేని వారు కనీసం తర్పణమైనా విడవాలి. తర్పణానికి పిండాలు అవసరం లేదు. తిలాంజలితో సరిపెడితే సరిపోతుంది.
ప్రతి మాసంలోను అమావాస్య పితరుల పుణ్య తిథి గా భావించబడినా మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది.
అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా, గురువుల ద్వారా తెలుసుకోన్నది.
1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
2. విదియలో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.
3. తదియలో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.
4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగవారు (శత్రువులు )లేకుండా చేయును.
5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.
6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.
7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.
8. అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును.
9. నవమి మంచి భార్యను సమకూర్చిను. భార్య బుధ్దిమంతు రాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.
10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.
11. ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతులను చేయును.
12. ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.
13. త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును, పశు, పుష్టి, సమృద్ధి, దీర్ఘాయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.
14. చతుర్దశి తిది రోజున వస్త్రం లేక అగ్ని ( ప్రస్తుత కాలంలో రైలు, మోటారు వాహనములు వల్ల విపత్తు ) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.
15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును.
16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చును.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృ దేవతలకు నమస్కరించవచ్చు.
శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. వారిని అనుగ్రహిస్తారు. ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధం నాడు లేదా ప్రతి రోజు ఉదయం, పుట్టినరోజు నాడు తమ తల్లి దండ్రులకు నమస్కరించి పఠిస్తారో వారికి దుర్లభమైనది అంటూ ఉండదు. పాపకర్మలు నశించిపోతాయి.
బ్రహ్మ ఉవాచ:-
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు.
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము.
ఫలశ్రుతి:-
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!
Related Postings:
1. Stotras In Telugu
tags: Bhakthi Margam, Bhakti margam , Bhakthi Margam Telugu, Bhaktimargam.in, bhakthimargam.in, mahalaya amavasya story in telugu, mahalaya amavasya significance, mahalaya amavasya good or bad, mahalaya amavasya pooja vidhanam in telugu, what is mahalaya amavasya, importance of mahalaya amavasya, mahalaya amavasya pitru paksha, how to do pitru paksha puja at home, mahalaya amavasya history in telugu, mahalaya amavasya 2023 date and time, mahalaya paksha 2023, mahalaya paksha amavasya 2023, mahalaya amavasya 2023 start and end date, mahalaya amavasya 2024

Comments
Post a Comment