అన్నమయ్య కీర్తన అలర చంచలమైన | annamaya keerthana alara chanchalamyna in telugu | bhakthi margam | భక్తి మార్గం

 

అన్నమయ్య కీర్తన అలర చంచలమైన

రాగం: రాగ మాలికా
తాళం: ఖండ చాపు

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల ।
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ॥

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల ।
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ॥

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల ।
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ॥

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల ।
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ॥

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల ।
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ॥

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల ।
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ॥

tags: annamaya keerthana alara chanchalamyna benefits, annamaya keerthana alara chanchalamyna in telugu, annamaya keerthana alara chanchalamyna in telugu with meaning, annamaya keerthana alara chanchalamyna in telugu by spb mp3 free download, annamaya keerthana alara chanchalamyna in telugu pdf, annamaya keerthana alara chanchalamyna in telugu with meaning pdf, annamaya keerthana alara chanchalamyna in telugu mp3 free download, annamaya keerthana alara chanchalamyna lyrics telugu, annamaya keerthana alara chanchalamyna meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, 

Comments