శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం అయినవిల్లి | Ainavilli Sri Vigneshwara Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం అయినవిల్లి
స్థలపురాణం
మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.
ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది..
ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి,గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.
ఆలయప్రశస్థి
అయినవిల్లి గ్రామంలోని వినాయక దేవాలయం
సువిశాలమైన ఆవరణలో ఎతె్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాల యంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయి తే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం.
రెండు గోపురాలతోచూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.
ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చెసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణ ముఖుడై ఉన్నాడు. ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయం లోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి ఉన్నారు.
అన్నపూర్ణా దేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉంది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధానాలయ ప్రాంగణం లోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాలనుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.
ప్రత్యేక పూజలు
ఈ ఆలయంలో ప్రతీనెలా కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికా యలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం.
దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తున్నారు. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు.
ఈ క్షేత్రంలో భాద్రపద శుద్ధ చవితి,కార్తీక మాసంలో మొదటి సోమవారం, నాలవ సోమవారం, కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాలవారు సైతం పాల్గొనే ఈ ఉత్సవం చూడటానికి అనేకాంది భక్తులు వస్తుంటారు.
శ్రీ సిద్ది వినాయకుడు - అయినవిల్లి
అత్యంత పురాతనమైన శ్రీ విఘ్నేశ్వర ఆలయములలో అయినవిల్లి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. ఇది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నది.
పూర్వము దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము నిర్వర్తించే ముందు ఈ వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్రపురాణమును బట్టి తెలియుచున్నది. తొలుత ఈ ఆలయ నిర్మాణము దేవతలే చేసారని పెద్దలు చెబుతూ ఉంటారు.
ప్రతినిత్యం శ్రీ స్వామి వారికి శివాగమ ప్రకారం విశేషార్చనలు సహస్రాధికములుగా నారికేళ ఫలోదకములతో అభిషేకములు చేయించుకుని వేలాది మంది భక్తులు శ్రీ స్వామి కృపా పాత్రులు అవుతారు.
భక్తుల కోర్కెలను తీర్చటంలో శ్రీస్వామి ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారు. అత్యంత సంతృప్తులైన భక్తులు వేయి నూట పదహార్ల వరకు నారికేళములతో అభిషేకములు చేయించుకుని మొక్కులు సమర్పించుకుంటారు.
ఇక ప్రతి మాసం ఉభయ చవితి తిధులు దశమి, ఏకాదశి,'వినాయక చవితి, నవరాత్రులలోను' శ్రీ స్వామి వారి వైభవములు వర్ణింపలేము. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణములో శివకేశవులకు భేదము లేదని చాటిచెపుతున్నట్లు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి, శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ విశ్వేశ్వరాలయం ప్రక్క ప్రక్కనే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా శ్రీకాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ఇది భక్తులు తప్పక దర్శించకోగల పుణ్యక్షేత్రం.
ఆలయం తెరుచు సమయం :
ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మరియు సాయంత్రం 3 : 30 నుండి 8 గంటల వరకు భక్తులు గుడిని దర్శించవచ్చు. ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు అభిషేకాలు నిర్వహిస్తారు
అయినవిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. కోనసీమగా ప్రసిధ్ది చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాలా అందం ఉంటాయి. కోబ్బరి తోటలు, గోదావరి నది ఒడ్డు, పచ్చని పోలాలు, కాలువలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
గన్నవరం to గల్ఫ్ కంట్రీస్‌కు నేరుగా విమాన ప్రయాణం స్థలపురాణం ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయకక్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది.
ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు.మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు
సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాల యంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయి తే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం.
రెండు గోపురాలతోచూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి.
శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చెసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణ ముఖుడై ఉన్నాడు
శ్రీ సిద్ధి వినాయకుడు ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయం లోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి ఉన్నారు.
అన్నపూర్ణా దేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉన్నది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధానాలయ ప్రాంగణం లోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాలనుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.
ప్రత్యేక పూజలు ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు
చిత్రకృప :
పండుగలు ఇక్కడ వినాయక చవితి, దసరా, ఉగాది, శివరాత్రి, కార్తీక మాసం రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంక్రాంతి రోజు ప్రభల ఉత్సవం ఇక్కడ ప్రత్యేకం.
వసతి సౌకర్యం :
సమీపంలోని అమలాపురం, రావులపాలెం, రాజమండ్రి, కాకినాడ లో వసతి పొందవచ్చు.
రవాణా:
ఐనవల్లి కాకినాడకు 72 కి.మీ. (వయా యానాం, అమలాపురం, ముక్తేశ్వరం),రాజమండ్రికి 55 కి.మీ. (వయా రావులపాలెం,కొత్తపేట,వనపల్లి), అమలాపురానికి 12 కి.మీ. (వయా ముక్తేశ్వరం) దూరం లో ఉంది.
Temple Authorities
Executive Officer
Ainavilli Village& Mandal,
East Godavari District.
Pin- 533 211,
Phone No:08856 -225812.

Comments
Post a Comment